
కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ – టాలీవుడ్ యంగ్ టైగర్ .. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న సినిమా పై రోజుకొక రూమర్ వినిపిస్తోంది. తాజాగా ఈ సినిమా వచ్చే వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ తొలి షెడ్యూల్‌లో జూనియర్ ఎన్టీఆర్ లేని సన్నివేశాల్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ చిత్రీకరించనున్నారని సమాచారం. ఈ లోగా జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 సీన్లు కంప్లీట్ చేస్తారు. ఇక మార్చి నుంచి ఎన్టీఆర్ ఈ సినిమా సెట్స్‌లోకి అడుగు పెడతారని తెలుస్తోంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓల్డ్ కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో ఓ ప్రత్యేక సెట్‌ను ఆర్ట్ డిపార్ట్‌మెంట్ వాళ్లు తీర్చిదిద్దుతున్నారు. ఇక ఈ కోల్‌కత్తా సెట్ లోనే ఈ సినిమా రెండో షెడ్యూల్ స్టార్ట్ కాబోతుందని సమాచారం.
ఈ పీరియాడిక్ మాస్ యాక్షన్ డ్రామా సినిమా లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌కు జోడీగా రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా కనిపించబోతుంది. మలయాళ యువ హీరో టొవినో థామస్ కూడా కీలక పాత్రలో నటించనున్నాడు. ఈ సినిమా కంటిన్యూగా షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చే ఏడాది జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మైత్రీ మూవీ మేకర్స్ - ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటీవల ఈ సినిమా గురించి ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. ‘ఆడియన్స్ ఊహించని స్థాయిలో ఈ మూవీని తీస్తున్నాను. ఎన్టీఆర్ పై అభిమానంతో ఈ సినిమా చేస్తున్నాను అని చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా కు డ్రాగన్ అనే టైటిల్ పరిశీలన లో ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ పై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.