మొదట సీరియల్స్ లో నటించి ఆ తర్వాత హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో పావని రెడ్డి కూడా ఒకరు. ఈమె తెలుగులో కూడా చాలా సీరియల్స్ లో నటించింది. తెలుగులోనే కాకుండా కోలీవుడ్ లో కూడా తన సినిమాలలో నటించింది పావని రెడ్డి.. ముఖ్యంగా చారి 111, డ్రీమ్, గౌరవం తదితర చిత్రాలలో నటించింది. అయితే తాజాగా ఈ నటి రెండో వివాహం చేసుకోబోతోందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.. అది కూడా ప్రముఖ కొరియోగ్రాఫర్ గా పేరుపొందిన అమీర్ తో ఈమె రెండో వివాహం చేసుకోబోతుందట.



ఈనెల 20వ తేదీన వీరి వివాహం జరగబోతున్నట్లు సమాచారం. అందుకు సంబంధించి ఇంస్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది పావని రెడ్డి. 2013లో పావని రెడ్డి మొదటి వివాహం టాలీవుడ్ నటుడు ప్రదీప్ కుమార్ ని ప్రేమించి మరి వివాహం చేసుకున్నదట.. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ 2017లో ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నారు.. అయితే ప్రదీప్ మరణానికి ముఖ్య కారణం పావని మరొకరితో చనువుగా ఉండడం వల్లే ఆత్మహత్య చేసుకున్నారనే విధంగా అప్పట్లో తెగ వార్తలు వినిపించాయి.


అయితే వీటి గురించి పావని ఎప్పుడు మాట్లాడలేదు కానీ ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోబోతోంది అది కూడా తమిళ బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొన్న ఈమె అక్కడ రన్నర్ గా నిలిచింది. అదే రియాల్టీ షోలో పాల్గొన్నటువంటి మరొక కంటెస్టెంట్  ఆమీర్ కూడా ఒకరు.. ఆ సమయంలోనే వీరిద్దరూ కలిసే ఉంటున్నారనే విధంగా ప్రచారం కూడా తమిళ మీడియాలో ఎక్కువగా వినిపించింది. ఇప్పుడు తాజాగా పెళ్లితో వీరిద్దరూ వైవాహ బంధం లోకి అడుగు పెట్టబోతున్నట్లు పావని రెడ్డి తెలియజేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏది ఏమైనా కొంతమంది ఈమెకు సపోర్ట్ చేస్తూ ఉండగా మరికొంతమంది నెగిటివ్గా కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: