- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

హమ్మయ్య ..ఫైనల్లి కోట్లాది మంది అక్కినేని అభిమానులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న బిగ్ బిగ్ గుడ్ న్యూస్ వచ్చేసింది . అక్కినేని  ఫ్యామిలీలో ని మెంబర్స్ ఇప్పటివరకు ఇండస్ట్రీలో 100 కోట్ల క్లబ్ లోకి చేరలేకపోయింది అన్న బాధ అలాగే ఉండిపోయింది అభిమానులకి . ఫైనల్లీ తండేల్ సినిమా తో ఆ కోరిక తీర్చేసాడు నాగ చైతన్య . యస్ ..ఇప్పుడు అదే జోష్ లో ఉన్నారు అక్కినేని ఫ్యాన్స్. నాగచైతన్య కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన "తండేల్" సినిమా రీసెంట్గా 100 కోట్లు క్రాస్ చేసింది .


ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది మూవీ టీం. దీంతో సోషల్ మీడియాలో అక్కినేని అభిమానులు పండగ చేసుకుంటున్నారు . ఇన్నాళ్లు అక్కినేని ఫ్యామిలీ హీరోస్ మాత్రమే ఆ రేర్ ఫీట్ ని సాధించలేకపోయారు అని జనాలు మాట్లాడుకున్నారు.  ఇప్పుడు నాగచైతన్య అలాంటి ఒక క్రేజీ రికార్డ్ సాధించి అభిమానులకి ఫుల్ జోష్ ని నింపాడు . దీంతో అక్కినేని ఫ్యాన్స్ కంగ్రాట్స్ నాగచైతన్య.. ఇకపై ఇలాగే నువ్వు 100 కోట్ల హీరోగా మారిపోవాలి అంటూ బ్లెస్ చేస్తున్నారు ..


శోభిత ఆయన లైఫ్ లోకి రావడం ఈ విధంగా కలిసి వచ్చింది అని మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో నాగచైతన్య తండేల్ సినిమాకి సంబంధించిన పోస్టర్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి . హీరోయిన్ సాయి పల్లవి కూడా ఈ సినిమా హిట్ అవ్వడానికి కారణం అంటూ పొగిడేస్తున్నారు. మొత్తానికి నాగచైతన్యను  ట్రోల్ చేస్తున్న వాళ్ల కి బాగానే నోరు మూయించాడు . విరూపాక్ష డైరెక్టర్ తో నాగచైతన్య నెక్స్ట్ సినిమాని కమిట్ అయ్యాడు . అంతేకాదు మిగతా ముగ్గురు డైరెక్టర్స్ తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ని ఫైనలైజ్ చేసే పనిలో బిజీబిజీగా ఉన్నాడు నాగ చైతన్య ..!

మరింత సమాచారం తెలుసుకోండి: