తెలుగు బుల్లితెర ఇండస్ట్రీలో తనకంటూ యాంకర్ గా ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న శ్రీముఖి సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటూ అప్పుడప్పుడు బ్లాస్ట్ అయ్యే ఫోటోలను షేర్ చేయడమే కాకుండా తనకు సంబంధించిన ఎలాంటి విషయాలనైనా సరే అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఎన్నో రియాలిటీ షో లలో పలు రకాల ఈవెంట్లకు హోస్టుగా చేస్తూ  వెండితెర పైన కూడా ఎంట్రీ ఇచ్చింది. అయితే వెండితెర పైన పెద్దగా ఆకట్టుకోలేకపోయినా అడపాదడపా పాత్రలలో కనిపిస్తూ ఉన్నది. యాంకర్ గా మాత్రం తిరుగులేని స్టార్ డమ్ అందుకున్నది.


ముద్దుగా అభిమానులు శ్రీముఖిని రాములమ్మ అని కూడా పిలుచుకుంటూ ఉంటారు. బిగ్బాస్ షో కి వెళ్ళిన తర్వాత మరింత క్రేజ్ అందుకున్న శ్రీముఖి ఆ తర్వాత తనదైన స్టైల్ లో యాంకరింగ్ తో గ్లామర్ తో మాత్రం తనని తాను రూపు మార్చుకుని మరి హైలెట్ గా నిలుస్తోంది. తాజగా సోషల్ మీడియాలో శ్రీముఖి షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో హీటెక్కించేలా కనిపిస్తున్నాయి. అయితే ఈ ఫోటోలు థాయిలాండ్ లోని ఫుకేట్ బీచ్ లో బ్లాక్ కలర్ దుస్తులలో గ్లామర్ తో బ్లాస్ట్ అయ్యే అందాలతో శ్రీముఖి రెచ్చిపోయింది.


బికినీని మించిన అందాలతో శ్రీముఖి ఈ ఫోటోలను షేర్ చేసింది మోకాళ్ల వరకు ఉన్న స్కర్ట్ వేసుకొని టాప్ టు బాటమ్ చాలా గ్లామరస్ లుక్ లో కనిపిస్తోంది శ్రీముఖి. ట్రాన్స్ఫర్మేషన్ దుస్తులలో సరికొత్తగా కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ ఫోటోలు చూసిన పలువురు నెటిజెన్స్ యాంకరమ్మ గ్లామర్ డోస్ పనిచేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. శ్రీముఖి ఎలాంటి దుస్తులలోనైనా సరే చాలా క్యూట్ గా అందంగా కనిపిస్తోందని మరో కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. అయితే గత కొంతకాలంగా శ్రీముఖి వివాహం పైన కూడా ఎన్నో రకాల రూమర్స్ వినిపించాయి. మరి ఈ ఏడాదైనా వివాహం చేసుకుంటుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: