
అయితే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో కమెడియన్ పృథ్వీ మాట్లాడుతూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అందులో కావాలనే 11 నెంబర్ ని తీసుకొచ్చి వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడాడు. అది మరింత వివాదంగా మరి చివరకు వైసీపీ అభిమానులు లైలా మూవీని బాయ్ కాట్ చేస్తామనేదాకా వచ్చింది. విడుదల అవ్వకముందే ఈ సినిమాపై నెగిటివిటీ పడిపోయింది. కొన్ని గంటల్లోనే హ్యాష్ ట్యాగ్ పెట్టి దేశవ్యాప్తంగా వైరల్ అయ్యేలా చేశారు. దీంతో వెంటనే హీరో విశ్వక్ సేన్ రంగంలోకి దిగి.. ఆ మాటలకు తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చాడు. పృథ్వీ మాట్లాడిన మాటలకు తాను క్షమాపణలు తెలుపుతూ.. తన సినిమాను రాజకీయ గోడవలకు బలి చేయవద్దని తెలిపాడు. ఆయనతో పాటు సినిమా నిర్మాత సాహు గారపాటి కూడా మీడియా ముందుకు వచ్చి క్షమాపణలు చెప్పారు.
అయితే విశ్వక్ సేన్ సోషల్ మీడియా వేదికగా వైసీపీకి సారీ చెప్పిన వారు తగ్గలేదు. అప్పటికి బాయ్ కాట్ మూవీ అంటూ హ్యాష్ ట్యాగ్ పెడుతున్నారు. ఇక సినిమా రిలీజ్ కి ముందు కూడా మరోసారి విశ్వక్ సేన్ సోషల్ మీడియా వేదికగా అందరినీ రిక్వెస్ట్ చేస్తూ వీడియో పెట్టాడు. కానీ ఫిబ్రవరి 14న విడుదల ఈ సినిమా బోల్తా కొట్టింది. ఈ సినిమా రిలీజ్ అయ్యి 4 రోజులు అయినప్పటికీ చాలా తక్కువ కలెక్షన్స్ ని రాబట్టింది. మొదటి రోజు రూ. కోటి 40 లక్షలు, రెండో రోజు రూ. 60 లక్షలు, మూడోవ రోజు రూ. 65 లక్షల కలెక్షన్స్ వచ్చాయి. 4వ రోజు కేవలం రూ. 7 లక్షల కలెక్షన్స్ ని రాబట్టింది. ఇక మొత్తంగా లైలా బడ్జెట్ రూ. 40 కోట్లు వచ్చిందని మూవీ మేకర్స్ తెలిపారు.