సినీ రంగంలో ప్రేమ కథలకు ఎంత క్రేజ్ ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ప్రేమ కథకు ఉన్న క్రేజ్ కంటే కూడా హార్రర్ కథలకు, సినిమాలకు ఎక్కువ ఉంటుంది. హార్రర్ మూవీస్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఈ హార్రర్ సినిమాలను కొందరు ఇష్టపడి చూస్తే.. మరికొందరు బయపడుతూ కూడా చూస్తారు. ఎందుకంటే ఆ మూవీస్ అంతా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి.
అయితే ఈ మధ్యకాలంలో అందరిని వణికించిన బెస్ట్ హార్రర్ సినిమా అంటే మొదట గుర్తొచ్చేది మసూద సినిమా. ఈ సినిమా రిలీజ్ అయిన కొత్తలో చూసిన ప్రతిఒక్కరూ ఉలిక్కిపడ్డారు. హార్రర్ సినిమాకు బెస్ట్ సినిమా ఇది అని చెప్పుకునేల ఈ సినిమాను తీశారు. ఈ సినిమా 2022లో విడుదల అయ్యి మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో నటి సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్ నటించారు. మసూద మూవీని డైరెక్టర్ సాయి కిరణ్ తెరకెక్కించారు. ఈ మూవీ రూ. 13 కోట్ల కలెక్షన్స్ ని వసూలు చేసింది.
ఇక ఈ సినిమాలో దెయ్యం పాత్రలో నటించిన నటి ముఖం కూడా కనిపించలేదు. అయినప్పటికీ అందరూ థియేటర్ లో భయంతో ఊగిపోయారు. అయితే సినిమా మొత్తం దెయ్యం పాత్రలో నటించిన ఆమె ముఖం మాత్రం రీవిల్ చేయలేదు. సినిమా మొత్తంలో బుర్కాలోనే కనిపించింది. ఆ పాత్రలో నటించిన హీరోయిన్ ఎవరా అని చాలా మంది అనుకున్నారు. ఇక ఆ పాత్రలో ఉన్న నటి మన తెలుగమ్మాయే అంట. ఆమె ఎవరో కాదు.. నటి అఖిలా రామ్ అంట. తాజాగా సోషల్ మీడియాలో ఆమె ఫోటోస్ పెట్టి మసూద ను చూశారా అంటూ చాలా పోస్ట్ లు పెడుతున్నారు. ఆ పోస్టులను చూసిన కొందరు ఆమె చాలా అందంగా ఉంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ బ్యూటీ లా పూర్తి చేసింది అంట. ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది.    
   

మరింత సమాచారం తెలుసుకోండి: