
ఓ ఫోటోలో ఆ చిన్నారి బుల్లెట్ బైక్ పైన ఎక్కిన ఫోటో, మరో ఫోటోలో ఆమె తండ్రి ఎత్తుకొని కనిపిస్తున్నాడు. ఫోటోలో కనిపిస్తున్న పాప మరి ఎవరో కాదు ప్రస్తుతం బాలీవుడ్ నే కాకుండా హాలీవుడ్ లోనూ సినిమాల చేస్తున్న ప్రియాంక చోప్రా. ఈ ముద్దుగుమ్మ తన అందం, అభినయంతో ఇండియాలోనే కాకుండా విదేశాలలో కూడా అభిమానులు సంపాదించుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ సినిమాలలో కూడా విజయాలు అందుకుంటూ ఫుల్ బిజీగా ఉంది. ప్రియాంక చోప్రా ప్రస్తుతం మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాపై ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయి. దీంతోపాటు మరికొన్ని హాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తోంది. పర్సనల్ ఇన్ఫర్మేషన్ కి వస్తే ప్రియాంక చోప్రా నిక్ జోనస్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తన కన్నా చిన్నవాడైనా నిక్ జోనస్ ను పెళ్లి చేసుకున్న ప్రియాంక వైవాక జీవితంలోను ఎంతో సంతోషంగా ఉంది. అటు సినిమాలతో ఇటు పర్సనల్ లైఫ్ తోను హ్యాపీగా ఉన్న ప్రియాంక తాజాగా షేర్ చేసిన ఫోటోలకు ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చింది. 1983, 2008 మధ్య ఈ ఫోటోలను దిగినట్టు పేర్కొంది. ఇవి తన జీవితంలో ఎంత అందమైన క్షణాలు అని తెలిపింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతుండడంతో నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.