
ఈ డైరెక్టర్ దర్శకత్వంలో సినిమా ప్రకటించకపోయినప్పటికీ ఈ ప్రాజెక్టు షేల్వ్ అయినట్లుగా రిపోర్ట్ లు వచ్చాయి. సెకండాఫ్ నచ్చకపోవడంతో ఈ సినిమా స్టొరీ లో మార్పులు చేసిన రాంచరణ్ కి నచ్చకపోవడంతో ఆపివేశారు.అయితే ఇప్పటికీ తనకు స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాలంటే యిష్టం అంటున్నాడు చరణ్. అలాంటి కథ కోసం వేచి చూస్తున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం రాంచరణ్ RC16 గా వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ మొదలుపెట్టారు. ఈ సినిమాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు.అలాగే ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనున్న విషయం తెల్సిందే. స్పోర్ట్స్ డ్రామాగా పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రూపొందుతోంది. రంగస్థలం చిట్టిబాబు తరహాలో RC16 సినిమాలో చరణ్ లుక్ ఉంటుందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.