టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ విలన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. 'జయం' మూవీతో విలన్ గా ఎంట్రీ ఇచ్చి.. వర్షం, నిజం సినిమాల్లో తన విలనిజంతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత హీరోగా మారాడు. హీరో అయ్యాక మళ్ళీ నెగిటివ్ రోల్ చేయలేదు. కానీ ఆడియన్స్ మాత్రం ఆయన నుంచి విలనిజాన్ని కోరుకుంటున్నారు. ముఖ్యంగా 'వర్షం' సినిమాలో ప్రభాస్, గోపీచంద్ మధ్య ఫేస్ టూ ఫేస్ సీన్స్ ను ఎవరూ అంత త్వరగా మర్చిపోలేరు. అందుకే ప్రభాస్ ఫ్యాన్స్ గోపీచంద్ ను చాలాసార్లు డార్లింగ్ తో మరోసారి సినిమా చేయాలని, అది కూడా విలన్ గా చేస్తే చూడాలని ఉందంటూ కోరారు. ఇదిలావుండగా మాస్ హీరోగా నిలదొక్కుకుంటున్న టైంలో వరుస ప్లాపులు ఎదురయ్యాయి. దీంతో అతని మార్కెట్ దెబ్బతింది. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. మినిమమ్ మార్కెట్ ఉన్న హీరోగా చలామణి అవుతున్నప్పటికీ.. గోపీచంద్ పారితోషికం రూ.3 కోట్ల దగ్గరే ఆగిపోయింది. వాస్తవానికి అతని మార్కెట్ రూ.30 కోట్ల వరకు ఉన్నప్పటికీ.. మాస్ అండ్ యాక్షన్ మూవీస్ మాత్రమే చేయాలి కాబట్టి.. గోపీచంద్ సినిమాలకి రూ.50 కోట్ల వరకు బడ్జెట్లు పెట్టాల్సి వస్తుంది.సో ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు వరుసగా రూపొందుతున్నాయి. 

ఇలాంటి టైంలో గోపి విలన్ గా చేసి మిగతా భాషల్లో కూడా పాపులారిటీ సంపాదించుకుంటే.. మార్కెట్ పెరుగుతుంది. కానీ గోపీచంద్ మాత్రం.. ఆ దిశగా అడుగులు వేయడం లేదు. ‘విలన్ గా చేయాల్సి వస్తే.. ప్రభాస్ సినిమాలో మాత్రమే చేస్తాను. మిగతా హీరోల సినిమాల్లో విలన్ గ చేయడం ఇష్టం లేదు’ అని తెగేసి చెప్పేశాడు.ఈ క్రమంలోనే సందీప్ రెడ్డి వంగ, ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో గోపీచంద్ కు విలన్ రోల్ ఫైనల్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది.ఇప్పటివరకు హీరోగా ప్రయత్నాలు చేసిన గోపీచంద్ ఇప్పుడు మాత్రం ఇక హీరో పాత్రలకు కొన్నాళ్లు బ్రేక్ ఇచ్చి.. విలన్ గా బిజీ అవ్వాలని వర్కౌట్ మొదలుపెట్టాడు. సందీప్ రెడ్డి వంగ కూడా ఇప్పటికే గోపీచంద్ కు లుక్ టెస్ట్ కూడా కంప్లీట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో నెక్స్ట్ ఇయర్ జూన్ లో రిలీజ్ చేయాలని సందీప్ రెడ్డి టార్గెట్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాడు. ఇందుకోసం ఇప్పటికే యాక్టర్స్ ను కూడా ఆల్మోస్ట్ ఫైనల్ చేశారు. ముందు సౌత్ కొరియా విలన్ ను ఈ సినిమాలో తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక ప్రభాస్ రిఫర్ చేయడంతో గోపీచంద్ ను ఈ సినిమాలో విలన్ గా ఫైనల్ చేసినట్లు టాక్.మరి దీని పై అధికారిక ప్రకటన రావాల్సివుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: