
ఇప్పుడు ఎక్కువగా హీరోలు, సినీ సెలబ్రిటీలు వారి సంపాదనను సైడ్ బిజినెస్ కి పెడుతున్నారు. అందులో ముఖ్యంగా హైదరాబాద్ లాంటి పాపులర్ సిటీస్ లో రెస్టారెంట్స్‌లను ప్రారంభిస్తున్నారు. మంచి ఆహారం, బ్రేవరేజస్ తో రెస్టారెంట్ లను పెడుతున్నారు. వారికి ఉన్న పాపులరిటీతో ఫ్యాన్స్ కూడా ఎక్కువగా ఆ రెస్టారెంట్ లకే వెళ్తారు. ఇక ఇతర సినీ సెలబ్రిటీలు కూడా వస్తారు. అయితే టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత కలిసి బంజారా హిల్స్ లో AN రెస్టారెంట్ ని 2022లో పెట్టారు. ఇక్కడ ఫుడ్స్ తిన్నవారంత ఆహార ప్రియులకు తప్పకుండా నచ్చుతుందని అంటుంటారు.
అలాగే ఐకన్ స్టార్ అల్లు అర్జున్ 2016 లోనే జూబ్లీహిల్స్ లో రెస్టారెంట్ ని ప్రారంభించారు. ఆ రెస్టారెంట్ కి హైలైఫ్ అని పేరు కూడా పెట్టారు. ఈ రెస్టారెంట్ మంచిగా పార్టీ చేసుకోవడానికి బాగుంటుంది అంట. ఇక అక్కినేని నాగార్జున కూడా జూబ్లీహిల్స్ లో N గ్రిల్ అని ఒక రెస్టారెంట్ ని, అలాగే N ఏషియన్ అనే చైనీస్ రెస్టారెంట్ ని ప్రారంభించారు. ఇది ప్రీమియం డైనింగ్ అనుభవం కావాలనుకునే వారికి బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. అక్కినేని నాగచైతన్య షోయూ అనే పేరుతో జూబ్లీహిల్స్ లో రెస్టారెంట్ ని ఓపెన్ చేశాడు.