సినీ నటుడు విక్కీ కౌశల్ గురించి పరిచయం అనవసరం. బాలీవుడ్‌ హీరో విక్కీ కౌశల్‌ నటించిన ఛావా సినిమా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ అయ్యింది. ఈ మూవీలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తుంది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది. దినేష్ విజన్ ఈ మూవీకి నిర్మాతగా పనిచేస్తున్నారు. ఈ సినిమాకు రెహమాన్‌ సంగీత అందించారు. ఈ సినిమాతో వీరిద్దరూ హిట్ అందుకున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా విడుదల అయ్యింది.
రష్మిక శంభాజీ మహారాజ్ భార్య పాత్రలో నటించింది. ఆ పాత్రలో నటించడం తనకి చాలా ఆనందాన్ని ఇచ్చిందని చెప్పింది. ఈ సినిమాలో ఏసుబాయి పాత్రకు రష్మిక 100 శాతం న్యాయం చేసిందని టాక్ వినిపిస్తుంది. కానీ సినిమాలో రష్మిక ఎంత అద్బుతంగా నటించినప్పటికి విక్కీ కౌశల్ ని బీట్ చేయలేక పోయింది. విక్కీ, శంభాజీ మహరాజ్‌ పాత్రలో జీవించేశాడని చాలా మంది అన్నారు. విక్కీ ఆ పాత్రకు ప్రాణం పోశాడాని.. నిజంగా శంభాజీ మహరాజ్‌ ఉండి ఉంటే ఇలా ఉండేవాడా అని అనుకునేల విక్కీ నటించడాని టాక్ వినిపించింది.  
సినిమా కోసం విక్కీ శారీరకంగా.. అలాగే మానసికంగా ఎంతగానో శ్రమించాడు. ఈ సినిమా షూటింగ్ కి ముందే విక్కీ కత్తి శాము, యుద్దాలు, గుర్రపు స్వారీలలో శిక్షణ కూడా తీసుకున్నాడు. అయితే ఇదిలా ఉండగా.. సినిమాలోని ఒక్క సన్నివేశంలో శంభాజీ పాత్రలో ఉన్న విక్కీ గేట్ అప్ ని చూసి అందరూ కన్నీరు పెట్టుకుంటారు. అయితే ఆ సన్నివేశంలో శంభాజీ శరీరాన్ని కత్తులతో కోసి, నాలుకని కత్తిరిస్తారు. ఆ సన్నివేశంలో విక్కీ గాయపడిన సింహంలా నిలబడే ఉంటాడు. ఆ సీన్ చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అయితే ఆ రక్తపు శరీరం మేకప్ చాలా ప్రత్యేకంగా వేశారంట. అయితే ఆ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. ఇక ఈ ఫోటోని చూసిన వారంతా చిత్రహింస పరీక్షలో నెగ్గిన విక్కీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.    


మరింత సమాచారం తెలుసుకోండి: