ప్రస్తుతం సినిమా పరిస్థితి ఎలా మారింది అంటే భారీ బడ్జెట్ తో తెరకేక్కించినా, భారీ తారాగణం తో సినిమాను ప్రమోట్ చేసినా రిలీజ్ వరకే ఆ హడావుడి ఉంటుంది.. ఒక్కసారి థియేటర్ లోకి వెళ్లిన ప్రేక్షకుడు నిరాశతో బయటకు వచ్చాడా ఆ సినిమా ఆడటం కష్టమే.. సినిమా కోసం ఎన్ని ఆర్భాటాలు చేసిన సినిమాలో కంటెంట్ ఉండాలి.. అది లేకపోతే ప్రమోషన్స్ పూత ఎంత పూసినా అంతా వ్యర్థమే దానికి ఉదాహరనే ఇటీవల రిలీజ్ అయిన పాన్ ఇండియా సినిమాలు..

ప్రస్తుతం టాలీవుడ్ పరిధి బాగా పెరిగింది.. గతంలో 100 కోట్ల కలెక్షన్స్ అంటేనే చాలా గ్రేట్ చెప్పుకునే వారు.. కానీ ఎప్పుడైతే పాన్ ఇండియా రేంజ్ కి తెలుగు సినిమా ఎదిగిందో అప్పటి నుంచి ప్రేక్షకులు మరింత ఆశిస్తున్నారు.. పాన్ ఇండియా వైడ్ 1000 కోట్ల కలెక్షన్స్ టార్గెట్ తో ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలు తెరకెక్కుతున్నాయి.. సినిమాలో కంటెంట్ ఉంటే ఆ కలెక్షన్స్ సాధించడం పెద్ద లెక్కేమి కాదని పలు సినిమాలు నిరూపించాయి.. అయితే టికెట్ ప్రైస్ ల విషయంలో కూడా ప్రేక్షకుడు మారాడు..తనకు ఎంతో ఇష్టమైన హీరో సినిమా రిలీజ్ అయిందంటే ఆ సినిమా టికెట్ రేటు ఎంత వున్నా కూడా మొట్టమొదటి షో చూసేవరకు నిద్రపోడు.. అలాంటి కల్ట్ ఫ్యాన్స్ ని మెప్పించేందుకు ప్రస్తుత దర్శకులు హీరో ఎలివేషన్స్ ఎక్కువగా చూపిస్తున్నారు…ఎలివేషన్ తగ్గిందా ప్రేక్షకుడికి బోర్ కొడుతుంది..

ఎక్కడా ల్యాగ్ లేకుండా సినిమా తీసేందుకు దర్శకనిర్మాతలు ప్రయత్నించినా సినిమా నిడివి విషయం పెద్ద తలనొప్పిగా మారుతుంది.. కథ ప్రకారం సినిమా నిడివి 3 గంటలు లేదా అంతకంటే ఎక్కువగా వస్తుండటంతో సినిమాను రెండు పార్టులుగా మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.. ఇప్పుడు వచ్చే సినిమాలు అన్నీ ఎక్కువగా అలానే వస్తున్నాయి.. రెండు పార్ట్స్ తెరకెక్కించడంతో నిర్మాతకు బిజినెస్ పరంగా మంచి లాభాలు వస్తాయి అని దర్శకులు ఈ పద్ధతిని ఫాలో అవుతున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: