- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ అల్లు అర్జున్ తాజాగా పుష్ప 2 సినిమాతో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్షేష‌న్‌ క్రియేట్ చేశాడో మనం చూసాం. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెర‌కెక్కించిన ఈ సినిమా తో అల్లు అర్జున్ బాక్సాఫీస్ రికార్డుల భరతం పట్టేశాడు. దేశవ్యాప్తంగా సినిమా జనాలు పూనకాలు వచ్చినట్టు ఊగిపోయారు. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ తన తర్వాత సినిమా కోసం రెడీ అవుతున్నాడు. మాటల మంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ దర్శకత్వం లో అల్లు అర్జున్ తర్వాత సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే ఈ లోగా తమిళ ద‌ర్శ‌కుడు అట్లీ తో బన్నీసినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి డిస్కషన్లు ఇప్పటికే పూర్తయ్యాయని .. . త్వరలోనే దీనిపై అధికారికి ప్రకటన కూడా ఉంటుందని తెలుస్తోంది. అట్లీ సినిమాలుకు బాలీవుడ్ లోనూ ఇటు నార్త్ లోను ఏ స్థాయిలో క్రేజ్ ఉందో చూసాం. కాగా ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్లు కూడా అట్లీ ఓకే చేసినట్టు తెలుస్తుంది.


బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ‌ జాన్వీ కపూర్ ని ఈ సినిమాలో హీరోయిన్గా ఫిక్స్ చేశాడట అట్లీ. జాన్వీ గ్లామర్ తో పాటు అభినయంతోను ఆకట్టుకునేందుకు ఈ సినిమాలో హీరోయిన్గా తీసుకున్నారట. అట్లీ ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియా స్థాయిలో తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. ఇది ఇలా ఉంటే జాన్వి కపూర్ తెలుగులో ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ స‌ర‌స‌న దేవర సినిమాతో హీరోయిన్గా పరిచయం అయ్యింది. ఆమె తెలుగులో తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఏదేమైనా బ‌న్నీ - జాన్వీ క‌పూర్ జోడీ అంటే ఆన్ స్క్రీన్ ఖ‌చ్చితంగా షేక్ అయిపోతుంది అన‌డం లో ఎలాంటి సందేహం ఉండ‌దు.

మరింత సమాచారం తెలుసుకోండి: