
దీంతో మంచు మనోజ్ కూడా టిడిపి పార్టీలో చేరి అవకాశాలు ఉన్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపించాయి. అందుకు తగ్గట్టుగానే అటు లోకేష్ తో పాటుగా, సీఎం చంద్రబాబును కూడా ఎన్నోసార్లు కలిశారు మంచు మనోజ్. దీంతో భేటీ కావడం చేత మరింత ప్రచారం జోరు అందుకోవడంతో ఈ విషయం పైన మీడియా ప్రశ్నించడంతో మనోజ్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవలే తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో పశువుల పండుగకు సైతం హాజరైనటువంటి మనోజ్ కు ఇదే ప్రశ్న ఎదురుగా..?
ఈ విషయంపై మనోజ్ మాట్లాడుతూ రాజకీయాలే కాదు ఏవి మన చేతులలో లేవు అంతా దేవుడు చేతులలోనే ఉంటుంది అంటూ తెలిపారు. ఆయన రాజకీయాలలోకి వస్తున్న వార్తలను అటు కొట్టి వేయకుండా ఓకే అనకుండా ఉండడంతో అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు పరిపాలన పైన కూడా ప్రశంసలు కురిపించడంతో ఖచ్చితంగా మనోజ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని టాక్ గట్టిగా వినిపిస్తోంది. మనోజ్ తన భార్య భూమ మౌనిక రెడ్డి తో కూడా పొలిటికల్ ఎంట్రీ కి సిద్ధమవుతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా భూమా శోభా నాగిరెడ్డి జయంతి వేడుకలో రాజకీయాలలో ఎంట్రీ ఇచ్చే విధంగా ప్రకటన జరగబోతోంది అనే విధంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి అసలు విషయం ఏంటన్నది చూడాలి.