
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప 2 సినిమాతో ఇండియన్ రికార్డులను తిరగ రాశాడు. పుష్ప 2 సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఏ స్థాయిలో ? విధ్వంసం క్రియేట్ చేసిందో చూశాం. పుష్ప 1 - పుష్ప 2 సినిమాలతో దర్శకుడు సుకుమార్ పేరు ఎక్కడికో వెళ్లిపోయింది. ఇప్పుడు సుకుమార్ నుంచి సినిమా వస్తుంది అంటే చాలు కేవలం టాలీవుడ్ ... సౌత్ ఇండియన్ సినీ అభిమానులు మాత్రమే కాదు .. నార్త్ ఇండియన్ అభిమానులు సైతం ఎంతో ఆసక్తితో ఎదురు చూసే పరిస్థితి వచ్చేసింది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో సుకుమార్ నెక్స్ట్ లెవెల్ కు చేరుకుంది. ఇక ఇప్పుడు అందరూ సుకుమార్ నుంచి రాబోయే తర్వాత సినిమా ఏమిటా అని ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సుకుమార్ తన తర్వాతే సినిమాను టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో చేయబోతున్నాడు అనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఈ సినిమా కోసం సుకుమార్ తాను ఫాలో అవుతున్న సెంటిమెంట్ ను పక్కన పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్తో సుకుమార్ తెర కెక్కించే పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన్నను తీసుకోవాలని చేస్తున్నడట. సుకుమార్ సాధారణంగా తన సినిమాలలో హీరోయిన్ రిపీట్ చేయడం జరగదు .. కానీ చరణ్ కోసం సుకుమార్ తొలిసారి తన సెంటిమెంట్ కాదని ఓ హీరోయిన్ ను కంటిన్యూ చేయనున్నాడట. ఇప్పటికే రష్మిక పుష్ప - పుష్ప 2 సినిమాలలో వరుసగా నటించారు. ఆమె పెర్ఫార్మన్స్ ఫిదా ఆయన సుకుమార్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టుగా సినీ సర్కిల్స్‌లో వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి మరియు ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో చూడాలి.