
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ సంక్రాంతికి శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశపరిచాడు. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా ఏ మాత్రం అంచనాలు అందుకోలేదు. చరణ్ ప్రస్తుతం ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్షన్లో స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ సరికొత్త మేకవర్తో కనిపించనున్నాడు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తన నెక్స్ట్ మూవీ ని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో చేయనున్నాడు. ఇటీవల రాంచరణ్ నెక్స్ట్ మూవీపై ఓ సాలిడ్ బజ్ వినిపించింది. బాలీవుడ్ దర్శకుడు నిఖిల్ నగేష్ భట్ డైరెక్షన్ లో ఓ భారీ మైథాలజికల్ సినిమాలో రామ్ చరణ్ నటించబోతున్నాడని టాక్ బాగా వైరల్ అయింది. ఈ కాంబినేషన్ ఎప్పటికే సెట్ అయిందని .. త్వరలోనే అధికారికి ప్రకటన కూడా రానుందని వార్తలు వినిపించాయి.
అయితే ఈ వార్తల పై బాలీవుడ్ దర్శకుడు నగేష్ క్లారిటీ ఇచ్చేశాడు. తను రామ్ చరణ్ తో ఎలాంటి మైథాలజికల్ సినిమాను తెరకెక్కించడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఈ వార్తతో రాంచరణ్ ఫ్యాన్స్ బాగా నిరాశకు లోనయ్యారు. రాంచరణ్ కెరియర్ లో ఓ తీరని కోరిక ఉందట. తన కెరీర్ లో ఎప్పటికైనా మైథాలజికల్ బ్లాక్ బస్టర్ సినిమాలో నటించాలన్నదే చరణ్ కోరిక. మరి ఈ కోరిక ఇప్పుడు ఎవరు నెరవేరుస్తారో ? అన్నది ఆసక్తిగా మారింది. అయితే సుకుమార్ తో చేయబోయే సినిమా ఎలాంటి నేపథ్యంలో వస్తుందో ? ఆయన తర్వాత ఎవరితో సినిమా చేస్తాడో అనేది అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏదేమైనా చరణ్ మైథలాజికల్ సినిమా చేస్తే ఆ క్రేజే వేరుగా ఉంటుంది.