
ఇంతకాలం మన దర్శక నిర్మాతలు ఏం చేశారు, దేశాన్ని తిట్టడం, మన సంస్కృతిని కించపరచడం, దేశభక్తిని తక్కువ చేసి మాట్లాడటం.. ఇదే కదా ట్రెండ్? జనాలు కూడా అవే చూసి చప్పట్లు కొట్టారు. కానీ ఇప్పుడు ప్రేక్షకులు మేల్కొన్నారు. దేశం కోసం నిలబడే సినిమాలు కావాలంటున్నారు. నిజం చెప్పాలంటే, ప్రజల్లో ఇప్పుడు 20% చైతన్యం వచ్చిందంతే. ఇంకా రావాల్సింది చాలా ఉంది. కానీ, ఈ 20% చైతన్యమే సినిమా ఇండస్ట్రీకి చుక్కలు చూపిస్తోంది.
గుర్తుందా కాశ్మీర్ ఫైల్స్ సినిమా తక్కువ బడ్జెట్‌తో తీస్తే, వసూళ్ల వర్షం కురిపించింది. అలాగే సబర్మతి ఎక్స్‌ప్రెస్ తరహా సినిమాలు కూడా జనాలకు బాగా కనెక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఛావా వచ్చి నిలబడింది. సరైన జాతీయవాదంతో సినిమా తీస్తే, జనం బ్రహ్మరథం పడతారని ప్రూవ్ అయింది.
ఇకనైనా సినిమా ఇండస్ట్రీ కళ్లు తెరవకపోతే అంతే సంగతులు. దేశభక్తిని తక్కువ చేసి మాట్లాడే రోజులు పోయాయి. మన సంస్కృతిని అవమానించే సినిమాలను జనాలు ఛీకొడుతున్నారు. బాయికాట్ సంస్కృతి ఊరికే రాలేదు. ప్రజల్లో మార్పు వచ్చింది కాబట్టే ఇది సాధ్యమైంది. ఇండస్ట్రీ పెద్దలు ఇంకానా గుడ్డిగా ఉంటారా లేక మారతారా ఛావా సక్సెస్ ఇచ్చిన ఈ హెచ్చరికను వింటారా లేదా గంగలో కలిపేస్తారా? చూడాలి మరి. టాలీవుడ్ డైరెక్టర్లు కూడా ఈ చిన్న సినిమాను చూసి పాఠాలు నేర్చుకోవాలి. అప్పుడే చిన్న సినిమాలతో ఎక్కువ డబ్బులు రాబట్టగలరు. ప్రేక్షకులను అలరించగలరు.