రాజమౌళి చాలా చాలా టాలెంటెడ్ డైరెక్టర్ . ఏ పని చేసిన సరే ఆచితూచి ఆలోచించి పర్ఫెక్ట్ గా చేస్తూ ఉంటాడు . ఆ విషయం అందరికీ తెలుసు. కాగా ఇప్పుడు రాజమౌళి - మహేష్ బాబు తో ఒక సినిమాని తెరకెక్కిస్తున్న విషయం అందరికీ తెలిసిందే . ఈ సినిమా షూట్ చక చకా కంప్లీట్ చేసేస్తున్నాడు రాజమౌళి . అయితే మహేష్ బాబుతో రాజమౌళి సినిమా అనగానే చాలామంది భయపడ్డారు . మహేష్ చాలా సాఫ్ట్.  రాజమౌళి చాలా హార్డ్. ఎలా బ్యాలెన్స్ చేయగలరు అంటూ భయపడిపోయారు.


కానీ మహేష్ బాబు ప్రతిదీ కూడా చాలా పక్కాగా ముందుకు తీసుకెళ్తున్నారు . కాగా ఇప్పుడు మహేష్ బాబు - రాజమౌళి సినిమా సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. రాజమౌళి తనతో వర్క్ చేసే హీరోలకి కండీషన్స్ ..కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతూ ఉంటాడు. షూటింగ్ సెట్స్ లో ఫోన్ అలో చేయకపోవడం..  అదేవిధంగా ఐడి కార్డ్ మెడలో వేసుకోవడం లాంటి కొన్ని క్రేజీ కండిషన్స్ తూచా తప్పకుండా ఫాలో అవుతూ ఉంటారు . అయితే ఏ హీరోకి పెట్టని  కండిషన్ ని మహేష్ బాబు కి మాత్రమే రాజమౌళి పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది .



సాధారణంగా రాజమౌళి తనతో వర్క్ చేసే హీరో కి ఎక్కడ కూడా బయట తిరగకూడదు ..కనిపించద్దు అంటూ కండిషన్స్ పెట్టరట . తనతో సినిమాకి కమిటీ అయినప్పుడు వేరొక డైరెక్టర్ తో సినిమాకు కమిటీ అవ్వకూడదు ఇది మాత్రమే రాజమౌళి కండీషన్ పెడతాడు . అయితే మహేష్ బాబుకి మాత్రం ఎక్కడా కూడా బయట మహేష్ బాబు ప్రైవేట్ పార్టీస్ లో ఫంక్షన్స్ లో కనపడకూడదు అంటూ చెప్పారట . ఆయన లుక్స్ రివిల్ అయిపోతాయి అని ఈ సినిమా టోటల్ రూట్ మార్చేసేది మహేష్ బాబు లుక్స్ నే అని.. ఆ కారణంగానే మహేష్ బాబుకి అలాంటి ఒక కండిషన్ పెట్టాడు అని తెలుస్తుంది . సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది...!

మరింత సమాచారం తెలుసుకోండి: