- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా భారీ అంచనాల మధ్య గత ఏడాది చివర్లో ప్రేక్షకులు ముందుకు వచ్చి బాక్సాఫీస్ దండయాత్ర చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు భారీ కలెక్షన్లు వచ్చాయి. దేవర 1 సినిమా సోలోగా ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యధిక వసూలు రాబట్టిన సినిమాకి రికార్డుల్లోకి ఎక్కింది. దేవర సినిమా ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ నేపథ్యంలో దేవర సీక్వెల్ దేవ‌ర 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దేవర సినిమాకు సీక్వెల్‌ కూడా ఉన్న‌ సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే దర్శకుడు కొరటాల దేవర 2 స్క్రిప్ట్ పనులు ప్రస్తుతం శ‌రవేగంగా చేస్తున్నారట. స్క్రీన్ ప్లే .. కీలక సన్నివేశాలను ఆసక్తికరంగా మరిచేందుకు కొరటాలతో పాటు ఆయన టీం గత కొన్ని వారాలుగా వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది.


వచ్చే ఏడాది జనవరి చివరివారం నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఇలాగా జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్తో కలిసి నటిస్తున్న వార్‌ 2 సినిమాతో పాటు ప్రశాంత్ నీల్‌ సినిమాలు పూర్తి చేస్తారు. దేవర సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించారు. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్‌ పాత్రలో నటించారు. ప్రముఖ తమిళ‌ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌ రవిచంద్రన్ మ్యూజిక్ అందించారు. అలాగే దేవర సినిమాలో శ్రీకాంత్ - ప్రకాష్ రాజు - అజయ్ - మురళీ శర్మ ఇతర కీలక పాత్రలలో నటించారు. దేవర 2 సినిమాలో కూడా వీరి పాత్రలో కీల‌కంగా ఉండబోతున్నాయి. అలాగే దేవర పార్టు 2 లో దేవ‌ర క‌థ ఎక్కువగా ఉంటుందట. పైగా కథలో చాలా డెప్త్ ఉంటుందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: