బేబీ నిర్మాత ఎస్ కె ఎన్ రీసెంట్ గా డ్రాగన్ మూవీ ఈవెంట్లో తెలుగు హీరోయిన్లను అస్సలు ప్రోత్సహించవద్దు అని,ప్రోత్సహిస్తే ఇలాగే ఉంటుంది అని, వారిని ఎంకరేజ్ చేసే బదులు వేరే ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్లను ఎంకరేజ్ చేయడం బెటర్ అంటూ మాట్లాడి తెలుగు హీరోయిన్లను ఒక విధంగా బ్యాన్ చేయాలి అసలు వారికి అవకాశాలు ఇవ్వద్దు అన్నట్లుగా మాట్లాడారు. అయితే ఈయన మాట్లాడిన మాటల వెనక ఉన్న అంతరార్థం ఏంటో తెలియదు కానీ అందరూ బేబీ మూవీ హీరోయిన్ వైష్ణవి చైతన్యని ఉద్దేశించే అలా మాట్లాడారు అని కామెంట్స్ చేశారు. ఈ విషయం పక్కన పెడితే.. ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ వ్యాఖ్యలపై తెలుగు నటి రేఖా భోజ్ తన సోషల్ మీడియా ఖాతాలో షాకింగ్ పోస్ట్ పెట్టింది.

 ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో ఈ విధంగా పోస్ట్ పెట్టింది.. తెలుగు హీరోయిన్ ని ఎంకరేజ్ చేయవద్దు అంటే తెలుగు హీరోయిన్ల పై బ్యాన్ విధించినట్టే.ఇలాంటి వ్యాఖ్యలు చేసే మీకు గౌరవం ఇవ్వడం ఏంట్రా.. ప్రతివాడు ఏదో మమ్మల్ని ఉద్దరించేసినట్టు ఎదవ బిల్డప్పులు ఇస్తున్నారు..తెలుగు హీరోయిన్లకు ఏదో తెగ అవకాశాలు ఇచ్చేస్తున్నట్టు తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేయద్దు అని మమ్మల్ని అధికారికంగా బ్యాన్ చేసినట్టు మాట్లాడి మా జీవనోపాధి పైనే దెబ్బ కొట్టారు కదరా.. మిమ్మల్ని ఏంట్రా గౌరవించేది పోరా..

అంటూ మిడిల్ ఫింగర్ చూపిస్తూ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం తెలుగు నటి రేఖా భోజ్ పెట్టిన ఈ పోస్ట్  సోషల్ మీడియా లో వైరల్ గా మారడంతో చాలామంది తెలుగు అభిమానులు కూడా ఈమెకు సపోర్ట్ గా కామెంట్లు పెడుతున్నారు.ఏది ఏమైనప్పటికి ఎస్కేఎన్ మాట్లాడిన మాటలు మాత్రం తెలుగు హీరోయిన్ల ను తీవ్రంగా హర్ట్ చేశాయి. మరి ఈ వ్యాఖ్యల పై ఎస్కేఎన్ ఏదైనా వివరణ ఇస్తారేమో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: