ప్రభాస్ కటౌట్ కి ఫిదా అవ్వని అమ్మాయిలు ఉండరు.కేవలం మామూలు అమ్మాయిలే కాదు సినీ ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్లు సైతం ప్రభాస్ కటౌట్ చూసి తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు. అంతే కాదు ఇలాంటి భర్త మా లైఫ్ లో కూడా రావాలి అని కోరుకున్న వారు ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు. అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఈ హాట్ బ్యూటీ కూడా ప్రభాస్ తో నాకు కోరిక తీర్చుకోవాలని ఉంది అంటూ మాట్లాడడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఇంతకీ ఆ హాట్ బ్యూటీ ఎవరయ్యా అంటే ఐటెం సాంగ్స్ చేస్తూ ఐటమ్ గర్ల్ గా మారిన ముమైత్ ఖాన్.. ఒకప్పుడు ముమైత్ ఖాన్ చేసిన ఐటెం సాంగ్స్ కి భారీ క్రేజ్ ఉండేది. ఓరోరి యోగి నన్ను కొరికెయ్ రో, ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అంటూ వచ్చే ఐటెం సాంగ్స్ తో ముమైత్ ఖాన్ క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. కేవలం ఐటెం సాంగ్స్ మాత్రమే కాకుండా పలు సినిమాల్లో కీరోల్స్ కూడా చేసింది.

అయితే అలాంటి బోల్డ్ బ్యూటీ ముమైత్ ఖాన్ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో నేను ప్రభాస్ తో యోగి సినిమాలో ఓరోరి యోగి నన్ను కొరికేయ్ రో అనే పాట షూటింగ్ కోసం షూటింగ్లో పాల్గొన్న సమయంలో ఆయన్ని తెగ విసిగించేశాను. ప్రభాస్ చాలా అమాయకుడు.. చాలా సెన్సిటివ్ పర్సన్.. నేను ఈ షూటింగ్ సమయంలో చాలాసార్లు ప్రభాస్ ని విసిగించేశాను. ఇక నా టార్చర్ భరించలేక ప్రభాస్ చాలాసార్లు కొరియోగ్రాఫర్ దగ్గరికి వెళ్లి తన గోడు చెప్పుకునేవాడు. అయినా కూడా నేను ఆయనను టీజ్ చేయడం ఆపలేదు.అలా ఆ పాట షూటింగ్ చేసిన సమయంలో ప్రభాస్ ని చాలా ఆటపట్టించాను. ఇక సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్ నాకు మంచి ఫ్రెండ్ అయిపోయాడు.

ఆ పాట షూటింగ్ సమయంలో నేను పాల్గొన్నన్ని రోజులు షూటింగ్ వాతావరణం లో మంచి ఫన్ క్రియేట్ చేశాము.ప్రభాస్ నా డార్లింగ్ అంటూ ముమైత్ ఖాన్ చెప్పుకొచ్చింది. అలాగే ఎవరైనా మీరు ఎవరితో డేటింగ్ చేయాలి అనుకుంటున్నారు అని నన్ను ప్రశ్న అడిగితే నేను మరో పేరు ఆలోచించకుండా డైరెక్ట్ గా ప్రభాస్ అని చెప్పేస్తాను. ప్రభాస్ తో ఒక్కసారైనా డేటింగ్ చేయాలి అని చెబుతాను అంటూ ముమైత్ ఖాన్ ఆ ఇంటర్వ్యూలో చెప్పిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.ఇక ఈ మాటలు విన్న ప్రభాస్ అభిమానులు కూడా ప్రభాస్ తో డేటింగ్ చేయాలని ఏ అమ్మాయి కోరుకోదు అంటూ కామెంట్లు పెడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: