
ఆలియా భట్ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు బిజినెస్ లు, యాడ్స్, సోషల్ మీడియా ఇలా అంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఇన్ఫ్లమేషనర్ మార్కెటింగ్ ప్లాట్ ఫామ్ పైన రిలీజ్ చేసిన లిస్టులో వర్డ్ లోనే అత్యధికంగా ప్రభావితమైన నటిగా రెండవ స్థానాన్ని సంపాదించుకున్నట్లు తెలుస్తోంది.. అయితే ఇందులో జెనీఫర్ లోపేస్ వంటి వారిని వెనక్కి నెట్టి మరి ఆలియా రెండవ స్థానం సృష్టించడంతో ఇది ఇండియన్ హిస్టరీలోనే ఒక భారీ విజయం అన్నట్లుగా అభిమానులు భావిస్తున్నారు.
దీంతో చాలామంది నెటిజెన్స్ ఆలియాకు విషెస్ కూడా తెలియజేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో 85 మిలియన్స్ పైగా ఇన్స్టాల్ ఈమెకు ఫాలోవర్స్ కలిగి ఉన్నారు.. 2024లో టాప్ -100 మోస్ట్ ఇంఫ్లూయ పీపుల్స్ లిస్టులో ఈమె కూడా అవకాశాన్ని దక్కించుకున్నది. ఇలా అన్ని విషయాలలో కూడా ఆలియా భట్ కు బాగా కలిసి వస్తోంది. ఆలియా భట్ ఇప్పుడు మరొకసారి ప్రభాస్ నటించిన ఫౌజీ చిత్రంలో మహారాణి పాత్రలో నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది ఈ చిత్రాన్ని హనురాగవపూడి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్ గా ఇమాన్వి నటిస్తూ ఉన్నది.