టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నారు. అందులో కొంతమంది మాత్రమే వారి వారసత్వాన్ని అందిపుచ్చుకొని సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా వస్తారు. అలాంటి వారిలో అల్లు అర్జున్ ఒకరు. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన అల్లు అర్జున్ ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. చిన్నతనం నుంచే సినిమాల్లోకి వచ్చిన అల్లు అర్జున్ ప్రస్తుతం బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించి పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగాడు. ఈ సినిమాలో తన నటనకు గాను అల్లు అర్జున్ ఎన్నో అవార్డులను సైతం అందుకున్నాడు. 

సినిమా అనంతరం అల్లు అర్జున్ పుష్ప టు సినిమాలో కూడా నటించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం అల్లు అర్జున్ తన తదుపరి సినిమా కోసం ఆలోచనలో ఉన్నారట. అల్లు అర్జున్ తన తదుపరి సినిమాను తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో చేయబోతున్నారట. చాలా కాలం నుంచి డైరెక్టర్ అట్లీ అల్లు అర్జున్ తో సినిమా చేయాలని ఆలోచనలో ఉన్నారట.


వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటుందని అభిమానులు సంబరపడుతున్నారు. చాలా కాలం నుంచి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటూ ఎన్నో రకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక ఈ వార్తలపై తాజాగా క్లారిటీ వచ్చింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుందని సమాచారం అందింది. కాగా, ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అని చర్చించే పనిలో ఉన్నారట.


ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ఐటమ్ సాంగ్ లో నటించబోతుందట. టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ చేయబోయే సినిమాలో జాన్వి కపూర్ ఐటమ్ సాంగ్ చేస్తే సినిమాకే హైలైట్ అవుతుందని అభిమానులు అంటున్నారు. ఇక ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీని తీసుకోబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఈ విషయంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: