టాలీవుడ్ యువ నటుడు నాగ చైతన్య గురించి పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి అందులో ఎన్నో మూవీలతో మంచి విజయాలను అందుకుని తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును దక్కించుకున్నాడు. ఇకపోతే గత కొంత కాలంగా ఈయనకు బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన విజయం లేదు. అలా బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన విజయం లేకపోవడంతో కాస్త డీలా పడిపోయిన చైతూ తాజాగా చందు మండేటి దర్శకత్వంలో రూపొందిన తండెల్ అనే సినిమాలో హీరో గా నటించాడు.

సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ , బన్నీ వాసు ఈ మూవీ ని నిర్మించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ని ఫిబ్రవరి 7 వ తేదీన తెలుగు తో పాటు తమిళ , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ పాజిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి మొదటి రోజు అద్భుతమైన ఓపెనింగ్స్ దక్కాయి. ఆ తర్వాత కూడా ఈ సినిమాకు సూపర్ సాలిడ్ కలెక్షన్లు వస్తున్నాయి. ఇకపోతే వరుస అపజయాల తరువాత తండెల్ మూవీ తో నాగ చైతన్య ఒక రేర్ రికార్డును సొంతం చేసుకున్నాడు.

తాజాగా ఈ మూవీ 100 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేశారు. ఇలా వరుస అపజాయలతో డీలా పడిపోయిన చైతూ "తండెల్" మూవీ తో 100 కోట్ల కలెక్షన్లను రాబట్టి అద్భుతమైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇకపోతే మరికొన్ని రోజుల పాటు ఈ మూవీ కి మంచి కలెక్షన్లు బాక్సా ఫీస్ దగ్గర వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: