
వాస్తవానికి ఈసినిమాను ‘పుష్ప 2’ మూవీతో పోటీగా విడుదల చేయాలని ఈమూవీ నిర్మాతలు భావించారు. భారీ అంచనాలు ఉన్న ‘పుష్ప 2’ తో ‘ఛావా’ పోటీ పడితే తమ రెండు సినిమాలకు నష్టం చేకూరుతుంది అన్న అంచనాలు రావడంతో తెలివిగా ‘ఛావా’ పోటీ నుంచి తప్పుకుని వాలెంటైన్స్ డే ను ఎంచుకుంది. ఈమూవీకి ఎటువంటి పోటీ లేకపోవడంతో ప్రస్తుతం ఈమూవీ కలక్షన్స్ అన్ని రాష్ట్రాలలోనూ కలక్షన్స్ బాగున్నాయి అంటూ బాలీవుడ్ ప్రేక్షకులు చాల బాగున్నాయి అన్న వార్తలు వస్తున్నాయి.
మరాఠా యోధుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ వీరగాథను ‘ఛావా’ సినిమాగా తీసిన విషయం తెలిసిందే శివాజీ మరణం తరువాత మొగల్ సామ్రాజ్య చక్రవర్తి ఔరంగ జేబు శివాజీ సామ్రాజ్యాన్ని ఆకమించు కోవాలని ప్రయత్నాలు చేసినప్పుడు ఛత్రపతి శంభాజీ మహారాజ ఔరంగ జేబు ప్రయత్నాలను ఏవిధంగా అడ్డుకున్నాడు అన్న చారిత్రాత్మక కథ చుట్టూ అల్లబడ్డ కథ ‘ఛావా’ ఈమూవీకకి సినిమా విమర్శకుల నుండి కూడ మంచి స్పందన వచ్చింది. ఈమూవీ సెకండ్ హాఫ్‌లోని వార్ సీన్స్ ను అద్భుతంగా చూపించడంతో ఈమూవీని సగటు ప్రేక్షకుడు ఈమూవీ బాగుంది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నాడు.
వాస్తవానికి ‘పుష్ప 2’ కలక్షన్స్ తెలుగు రాష్ట్రాల కంటే హిందీ రాష్ట్రాలలో ఎక్కువగా వచ్చాయి. దీనితో డిసెంబర్ లో ‘పుష్ప 2 ను టార్గెట్ చేస్తూ ‘ఛావా’ విడుదల అయి ఉంటే ఈ రెండు సినిమాలు ఈ స్థాయిలో విజయవంతం అయి ఉండేవి కావు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి …