
థమన్ రెమ్యునరేషన్ సైతం ఒకింత భారీ స్థాయిలో ఉంది. థమన్ పారితోషికం 4 నుంచి 5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది. బాలయ్య థమన్ కాంబినేషన్ మరికొన్ని సంవత్సరాల పాటు కొనసాగాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. థమన్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీ అవుతూ ఇతర మ్యూజిక్ డైరెక్టర్లకు గట్టి పోటీ ఇస్తున్నారనే చెప్పాలి.
బాలయ్య సైతం తన సినిమాల స్క్రిప్ట్స్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అఖండ2 సినిమా హిట్ గా నిలిస్తే మాత్రం బాలయ్య బోయపాటి శ్రీనుకు కూడా గిఫ్ట్ గా ఇస్తారేమో చూడాల్సి ఉంది. బాలయ్య బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేసుకుంటున్నారు. అఖండ సీక్వెల్ కు బాలయ్య 35 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు.
బాలయ్య మాస్, క్లాస్ అనే తేడాల్లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే సినిమాలకు ఓకే చెబుతుండటం గమనార్హం. బాలయ్య సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో అద్భుతాలు చేస్తున్నాయి. బాలయ్య సీనియర్ హీరోలలో కలెక్షన్ల పరంగా కూడా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుండటం గమనార్హం. బాలయ్య థమన్ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద మరిన్ని సంచలనాలు సృష్టిస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. ఈ కాంబోలో తెరకెక్కే సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.