
కానీ కొద్ది మంది మాత్రమే అలాంటి వాళ్ళు ఉన్నారు.అయితే ఓ డైరెక్టర్ క్యాస్టింగ్ కౌచ్ ఇండస్ట్రీలో ఉంది అని డైరెక్ట్ గానే చెప్పారు.కానీ ఆయన పని చేసిన ప్రొడక్షన్ హౌస్ లో అలాంటి పరిస్థితి ఆయనకు ఎదురయింది కావచ్చు. కానీ అన్ని చోట్ల అలా ఉండదు.కమిట్మెంట్ అడిగేవాళ్లు ఎంతమంది అయితే ఉంటారో కమిట్మెంట్ ఇచ్చే వాళ్ళు కూడా అంతేమంది ఉంటారు. ఇక మన ఇండస్ట్రీలో కమిట్మెంట్ అడిగేవాళ్లు తక్కువే ఉన్నారు. ఇచ్చే వాళ్ళు కూడా తక్కువే ఉన్నారు.ఈ మధ్యకాలంలో అమ్మాయిలు చాలా మెచ్చ్యూర్డ్ గా ఆలోచిస్తున్నారు.ఇక ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంది అనేది కొంతవరకు నిజమే. అయితే ఈ క్యాస్టింగ్ కౌచ్ నాకు కూడా ఎదురైంది. కానీ రివర్స్లో ఆ అమ్మాయే నాకు కమిట్మెంట్ ఇస్తానని నా దగ్గరికి వచ్చింది. కానీ నేను మాత్రం అందుకు ఒప్పుకోలేదు.
అంటూ ఇండైరెక్టుగా తన దగ్గరికి కూడా ఓ హీరోయిన్ వచ్చి తన కోరిక తీరుస్తానని రివర్స్లో వచ్చి అడిగింది.కానీ తానే ఆ పనికి ఒప్పుకోలేదు అంటూ తమ్మరెడ్డి భరద్వాజ ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.అలాగే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ట్రోలింగ్ కి గురైన బాలకృష్ణ దబిడి దిబిడే సాంగ్ గురించి కూడా తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ.. డాకు మహారాజ్ సినిమాలో దబిడి దిబిడి సాంగ్ పెట్టడం అనవసరం ఆ పాట పెట్టకుండా ఉంటే బాగుండేది. నేను కూడా గతంలో బంగారు మొగుడు సినిమాలో ఇలాంటి పాట పెట్టి నీచమైన పనిచేశాను. ఆ పాట ఆ సినిమాలో చాలా దరిద్రంగా ఉంది. అనవసరంగా పెట్టాననిపించింది అంటూ తమ్మారెడ్డి భరద్వాజ ఐటెం సాంగ్ గురించి కూడా స్పందించారు.ప్రస్తుతం తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి