టాలీవుడ్ లో గతంలో లక్కీ హీరోయిన్గా పేరు పొందిన పూజా హెగ్డే కెరియర్ ఇప్పుడు రివర్స్లో నడుస్తోంది. ఈ అమ్మడు నటించిన సినిమాలే తక్కువ అయినప్పటికీ కూడా ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు నిరాశ పరుస్తూ వస్తోంది. దీంతో పూజ హెగ్డే గ్రాఫ్ కూడా నెమ్మదిగా పడిపోతోంది .మొన్నటిదాకా సౌత్ లో అలరించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఒక్కసారిగా దూసుకుపోయిన అవకాశాలను బాగానే అందుకుంది. కానీ రాధే శ్యామ్ సినిమా ఎప్పుడు ప్లాప్ అయిందో అప్పటినుంచి ఈమెకు బ్యాడ్ టైమ్ నడుస్తూ ఉంది.



దీంతో తన అదృష్టాన్ని బాలీవుడ్ వైపుగా పరీక్షించుకోవాలని అక్కడ అడుగుపెట్టిన అదేంటో అవకాశాలు వచ్చినా కూడా ఈమె సినిమాలో నిరాశ పరుస్తూనే ఉన్నాయి. ఎలాగోలాగా గ్లామర్ తో కొద్ది రోజులు నెట్టుకొచ్చిన ఇప్పుడు తను హిట్ ట్రాక్ ఎక్కడానికి ఏం చేయాలో తెలియక అయోమయంలో పడిందట. దీంతో బాలీవుడ్ లో కూడా అన్ లక్కీ హీరోయిన్గా ముద్ర వేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం పూజ హెగ్డే చేతిలో ఉన్న సినిమాలతోనైనా సక్సెస్ అందుకుంటుందా లేదా అనే అనుమానం కూడా ఉన్నదట. ఇన్ని ఫ్లాప్స్ ఉన్నప్పటికీ కూడా ఈమెకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి.


బాలీవుడ్ లో రెండు చిత్రాలతో పాటు తమిళంలో సూర్యతో ఒక సినిమా అలాగే విజయ్ దళపతితో ఒక సినిమాలో నటిస్తోంది. ఒకవేళ ఈ సినిమాలు ఫ్లాప్ అయితే ఇక పూజా హెగ్డే తట్ట బుట్ట సర్దాల్సిందే అని పలువురు నెట్టిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.కానీ పూజ హెగ్డే కి మాత్రం ఈ సినిమాల మీద హోప్స్ అసలు వదల లేదట. తెలుగులో ఇప్పటికీ తనకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి అనుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ఒకటో రెండో సినిమాలతో డిస్కషన్ కూడా చేసిన చివరి నిమిషంలో అవి మిస్ అవుతున్నాయని టాక్ వినిపిస్తోంది. పూజా హెగ్డే అభిమానులు మాత్రం తెలుగులో మళ్లీ రీఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: