![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/breaking/134/salaar-na-closing-gross-rd-highest-telugu-film-evercae337d5-56bb-4e19-908a-af8cd6f9f23d-415x250.jpg)
అప్పటినుంచి ఇప్పటివరకు ఈ సినిమా ఓటీటీలో అందుబాటులో ఉండి సంచలనం సృష్టించింది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా నిర్మాతలకు మంచి లాభాలను అందిస్తోంది. సలార్ మూవీ సాధించిన రికార్డ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని చెప్పవచ్చు. ఓటీటీలో సైతం సలార్ మూవీ చరిత్ర సృష్టించడం గమనార్హం. సలార్ సాధించింది రికార్డ్ కాదని ప్రేక్షకుల ప్రేమ, అభిమానానికి నిదర్శనం అని పృథ్వీరాజ్ తెలిపారు.
ఈ ప్రయాణాన్ని నిజంగా మరపురానిదిగా చేసినందుకు అందరికీ ధన్యవాదాలు అని ఆయన కామెంట్లు చేశారు. ఎక్స్ వేదికగా సలార్ టీమ్ ను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. సలార్ మూవీ బుల్లితెరపై కూడా సంచలనాలు సృష్టిస్తోంది. ఈ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ కు సైతం ఊహించని స్థాయిలో రేటింగ్స్ వస్తున్నాయి. గతేడాది ఎక్కువ సంఖ్యలో వ్యూస్ సాధించిన టాప్3 సినిమాలలో సలార్ ఒకటిగా నిలిచింది.
వెండితెర, బుల్లితెర అనే తేడాల్లేకుండా అన్ని చోట్ల సలార్ మూవీ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. సలార్ సినిమాకు సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఈ సీక్వెల్ ఎప్పుడు విడుదలవుతుందో చూడాల్సి ఉంది. త్వరలో ఈ సీక్వెల్ కు సంబంధించిన అప్ డేట్స్ వస్తాయని వార్తలు వినిపిస్తుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. ప్రభాస్ భవిష్యత్తు సినిమాలు సైతం సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.