సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్ లో చాలా సక్సెస్ అయ్యారు. ఆయన పర్సనల్ కెరియర్ తో పాటు ప్రొఫెషనల్ కెరియర్ లో కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రస్తుతం రాజమౌళి వంటి దిగ్గజ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నారు. ఇక వీరి కాంబోలో రాబోయే సినిమా హాలీవుడ్ లెవెల్ లో ఉంటుంది అని ఇప్పటికే ఎన్నో వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే అలాంటి మహేష్ బాబుకి ఉన్న ఒక పరమ చెత్త నీచమైన అలవాటు ఏంటో ఇప్పుడు చూద్దాం. చాలా మంది హీరోలకు కొన్ని రకాల బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి.అలా మహేష్ బాబు కూడా ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉండేది. అదేంటంటే విపరీతంగా సిగరెట్ కాల్చడం. అయితే ఇప్పుడు మానేసారు. కానీ ఆయన ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎక్కువగా సిగరెట్లు తాగే వారట.

రోజుకి 10,15 డబ్బలు కాల్చేవారంటే ఆయన సిగరెట్ కి ఎంతగా అడిక్ట్ అయిపోయారో చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఆయన నటించిన టక్కరి దొంగ సినిమా షూటింగ్ సెట్లో అయితే చాలాసార్లు సిగరెట్ తాగుతూ మీడియాకి దొరికిపోయారు.అలా నమ్రత ఎన్నిసార్లు సిగరెట్ మానేయమని చెప్పినా కూడా అస్సలు వినకపోయే వారట.సిగరెట్ తాగడం తన వ్యసనంగా పెట్టుకున్నారట.కానీ చివరికి సడన్గా ఆయన ఓ రోజు సిగరెట్ తాగడం మానేశారు. అది కూడా ఒక బుక్ కారణంగా.. మహేష్ బాబు ఎలాగైనా స్మోకింగ్ అలవాటుని మానుకోవాలి అని మెల్లిమెల్లిగా బుక్స్ చదవడానికి అడిక్ట్ అయ్యారట.

ఖాళీగా ఉంటే స్మోకింగ్ చేయాలి అనే ఆలోచన వస్తుంది అనే ఉద్దేశంతో బుక్స్ చదవడం అలవాటు చేసుకున్నారట. అలా ఓసారి ఎలెన్ కార్ రాసిన ది ఈజీ వే టు స్టాప్ స్మోకింగ్ అనే బుక్ చదివినప్పటినుండి సిగరెట్ తాగడానికి పూర్తిగా దూరమైపోయారట.ఈ ఒక్క బుక్ తన జీవితాన్నే మార్చేసింది అని మహేష్ బాబు అంటుంటారు. అలా మహేష్ బాబు తనకి ఉన్న పరమ చెత్త అలవాటుని అలా బుక్స్ చదవడం ద్వారా మానేసుకున్నారట

మరింత సమాచారం తెలుసుకోండి: