నాగశౌర్య బెంగళూరుకి చెందిన ఇంటీరియర్ డిజైనర్ అయినటువంటి అనూష శెట్టిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.వీరి పెళ్లి 2023లో జరిగింది.అయితే పెళ్ళై రెండేళ్లయినా కూడా ప్రెగ్నెన్సీ కి సంబంధించిన గుడ్ న్యూస్ చెప్పడం లేదు. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. అయితే నాగశౌర్య సినిమాలో బిజీగా ఉన్న సమయంలో తాజాగా నాగశౌర్య తల్లి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.నా కొడుకు పెళ్లయ్యాక నన్ను వదిలేసి వేరు కాపురం పెట్టాడంటూ నాగశౌర్య తల్లి మాట్లాడిన మాటలు విని చాలామంది  సోషల్ మీడియా జనాలు షాక్ అవుతున్నారు. మరీ నాగశౌర్య తల్లి ఏం మాట్లాడిందో ఇప్పుడు చూద్దాం.టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా గుర్తింపు సంపాదించిన నాగశౌర్య ఓవైపు సినిమాలతో పాటు మరోవైపు బిజినెస్ లు కూడా చేస్తున్నారు. 

అలా నాగశౌర్య తన తల్లితో కలిసి ఉష ప్రొడక్షన్ కంపెనీని స్టార్ట్ చేశారు.అలాగే పలు రెస్టారెంట్లు కూడా నడిపిస్తున్నారు. ఇక రెస్టారెంట్ ద్వారా ఫేమస్ ఆయన నాగశౌర్య తల్లి పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తుంది. అలా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగశౌర్య తల్లి ఉష మాట్లాడుతూ..పెళ్లయ్యాక నా కొడుకు నన్ను వదిలేసి వేరు కాపురం పెట్టాడు. ప్రస్తుతం వాళ్ళిద్దరూ వేరే దగ్గర మేము వేరే దగ్గర ఉంటున్నాము. అయితే పెళ్లికి ముందే నాగశౌర్య ఈ విషయాన్నీ చెప్పాడు. పెళ్లయ్యేదాకా నీ దగ్గర ఉంటానమ్మా.. ఆ తర్వాత నేను వేరే ఇంట్లోకి వెళ్లి పోతాను అన్నాడు.

ఇక వాడి మాటలకి నేను కూడా ఓకే చెప్పాను.అలా అనూష శెట్టిని పెళ్లి చేసుకున్నాక వాడు వేరు కాపురం పెట్టాడు. సమయం దొరికినప్పుడల్లా మా ఇంటికి వచ్చి వెళ్తుంటాడు. అయితే పెళ్లయ్యాక నా కొడుకు నా దగ్గర లేడు అనే బాధ నాలో ఎప్పటికీ ఉంటుంది అంటూ కాస్త ఎమోషనల్ గా మాట్లాడింది నాగశౌర్య తల్లి. ప్రస్తుతం నాగశౌర్య తల్లి మాట్లాడిన మాటలు నెట్టింట్లో వైరల్ గా మారడంతో కొత్త కోడలు వచ్చాక నాగశౌర్యకి తల్లికి మధ్య చిచ్చు పెట్టిందా.. అందుకే తల్లిని వదిలేసి నాగశౌర్య వేరు కాపురం పెట్టాడా అంటూ కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: