తెలుగు , తమిళ్ ఇండస్ట్రీలలో ఏక కాలంలో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న ముద్దుగుమ్మలలో కీర్తి సురేష్ ఒకరు. ఈమె తమిళ సినిమాల ద్వారా కెరియర్ను మొదలు పెట్టి అక్కడ మంచి గుర్తింపును సంపాదించుకున్న తర్వాత తెలుగు సినిమాల్లో నటించడం స్టార్ట్ చేసింది. ఈ ముద్దు గుమ్మ నేను శైలజ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమా తోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత నేను లోకల్ , మహానటి సినిమాలతో మంచి విజయాలను అందుకోవడంతో ఈ బ్యూటీ కి అద్భుతమైన క్రేజ్ తెలుగు సినీ పరిశ్రమలో వచ్చింది.

ఆ తర్వాత ఈమెకి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు రావడంతో ఈ బ్యూటీ ఏకంగా తెలుగు లో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. ఇకపోతే కెరియర్ ప్రారంభంలో స్కిన్ షో కు చాలా దూరంగా ఉంటూ డీసెంట్ అండ్ క్లాస్ పాత్రలలో నటిస్తూ వచ్చిన కీర్తి సురేష్ ఈ మధ్య కాలంలో మాత్రం తన అందాలతో కూడా ప్రేక్షకులకు మంచి కిక్ ను ఎక్కిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ హిందీ సినిమా అయినటువంటి బేబీ జాన్ అనే మూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ తోనే ఈమె హిందీ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ మూవీ లో ఈ బ్యూటీ తన అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇకపోతే తాజాగా కీర్తి సురేష్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో ఈ బ్యూటీ అదిరిపోయే లుక్ లో ఉన్న టైట్ డ్రెస్ ను వేసుకొని హాట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: