
తెలుగువారు అయ్యుండి తెలుగు సినిమాల్లో మన అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వనంటూ ఇలా కామెంట్ చేయడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు .. ఇక దీంతో సోషల్ మీడియా వేదికగా ఎస్కేఎన్ కామెంట్స్ పై తీవ్ర స్థాయిలో వ్యతిరేకిత వస్తుంది . అయితే ఇప్పుడు తాజాగా ఈ వివాదంపై బేబీ నిర్మాత స్పందించారు. ఇప్పటికే టాలీవుడ్ లో చాలామంది తెలుగు హీరోయిన్లను వెండితెరకు పరిచయం చేసాం ..ఫన్ కోసమో, ఫ్లోలోనో ఓ కాంట్రావర్సీకి రూట్ వేసే స్టేట్మెంట్ ఇచ్చారు .. కానీ దీన్ని హీరోయిన్ వైష్ణవి చైతన్యకు ముడిపెట్టి చూడడం మంచిది కాదేమో ? అంటూ ఓ జర్నలిస్ట్ ఎస్కేఎన్ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ కూడా చేశారు .. ఇక ఎందుకు ఎస్కేఎన్ .. హహహ ఈమధ్య చాలామంది వినోదం కన్నా వివాదానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు .. గురూజీ ఏం చేస్తాం చెప్పండి అంటూ స్మైల్ ఎమోజి పోస్ట్ చేశారు ..
దీంతో ఎస్కేఎన్ తెలుగు హీరోయిన్లను పరిచయం చేశారేంటి అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు టాలీవుడ్ లో ఎస్కేఎన్ చాలామంది తెలుగు అమ్మాయిలను పరిచయం చేశారు .. రష్మీ, ఆనంది (ఈరోజుల్లో), మానస (రొమాన్స్), ప్రియాంక జవాల్కర్ (టాక్సీవాలా), వైష్ణవి చైతన్య (బేబీ), హారిక (సంతోష్ శోభన్ సినిమా), ఖుషి (3 రోజెస్) ఈ హీరోయిన్లను టాలీవుడ్ కి పరిచయం చేశాడు. అలాంటి ఈ నిర్మాత ఇలాంటి ఊహించని వ్యాఖ్యలు చేయడంపై ఏదో మర్మం దాగుందని కూడా మరికొందరు అంటున్నారు. ఈ ఇష్యుపై హీరోయిన్ వైష్ణవి చైతన్య ఏ విధంగా రియాట్ అవుతుందో చూడాలి .
ha ha ha ఈ మధ్య చాలా మంది వినోదం కన్నా వివాదానికే మొగ్గు చూపుతున్నారు గురూజీ
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) February 17, 2025
ఏం చేస్తాం చెప్పండి :) https://t.co/zMpLFpQ5Rl