
ముఖ్యంగా బాలీవుడ్ వెబ్ సిరీస్లలో గ్లామర్ యాంగిల్ లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. అలాగే ఈమె కండోమ్ వంటి బోల్డ్ కమర్షియల్ యాడ్లలో కూడా నటించడంతో చాలామంది శోభితని ట్రోల్ చేయడం కూడా జరిగింది. అయితే వివాహం తర్వాత బోల్డ్ ఇమేజ్ ని పూర్తిగా వదిలేసుకోవాలని ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఇటీవలే తండేల్ సక్సెస్ మీట్లో ఈ మార్పు చాలా స్పష్టంగా కనిపించిందట. గ్లామర్ లుక్కులో కనిపించే శోభిత ఎక్కువగా సాంప్రదాయమైన చీరకట్టులోనే కనిపించాలని సంచలన నిర్ణయం తీసుకున్నదట.
పెళ్లి కాక ముందు వరకు గ్లామర్ షో తో స్పెషల్ ఫోకస్ పెట్టిన శోభిత ఇప్పుడు చాలా సాంప్రదాయమైన పద్ధతిలో కనిపించడానికి మక్కువ చూపిస్తుందట ఈ మార్పుకు గల కారణం నాగచైతన్యతో ఈమె జీవితం మొదలైనప్పటి నుంచి బాధ్యతగా వ్యవహరించాలని ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే శోభిత కూడా కెరియర్లో గ్లామర్ రోల్స్ పాత్రలను తగ్గించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా కంటెంట్ పరంగా కూడా బెస్ట్ మూవీస్ పైన ఎక్కువగా దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకుందట శోభిత. తన వల్ల అక్కినేని కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని భావించే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.