హిందీ సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో విక్కీ కౌశల్ ఒకరు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో హిందీ సినిమాలలో నటించి వాటిలో చాలా మూవీలలో మంచి విజయాలను అందుకున్నాడు. ఇకపోతే ఈ మధ్య కాలంలో విక్కీ కౌశల్ హీరో గా రూపొందిన చాలా మూవీ లు అద్భుతమైన విజయాలను సాధించడంతో ప్రస్తుతం ఈయన హిందీ సినీ పరిశ్రమలో కెరియర్ను అద్భుతమైన జోష్ లో ముందుకు సాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా విక్కీ కౌశల్ "ఛావా" అనే హిందీ సినిమాలో హీరో గా నటించాడు.

మూవీ లో టాలీవుడ్ ఇండ స్ట్రీ లో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న ముద్దు గుమ్మ లలో ఒకరు అయినటువంటి రష్మిక మందన హీరోయిన్గా నటించింది . ఈ మూవీ తాజాగా థియేటర్లలో విడుదల అయింది . ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చిం ది . దానితో ఈ మూవీ కి మొదటి రోజు సూపర్ సాలిడ్ ఓపెనింగ్ లు లభించాయి . అలాగే ఆ తర్వాత కూడా ఈ మూవీ కి అద్భుతమైన కలెక్షన్లు ప్రపంచ వ్యాప్తంగా దక్కుతున్నాయి. ఇకపోతే ఛావా మూవీ కోసం విక్కీ కౌశల్ పెద్ద మొత్తంలో భారీతోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది.

విక్కీ కౌశల్ దాదాపుగా ఒక్కో సినిమాకి 15 నుండి 20 కోట్ల వరకు పారితోషకాన్ని పుచ్చుకుంటాడట. ఇక ఛావా సినిమా కోసం మాత్రం ఈయన కేవలం 10 కోట్ల పారితోషకాన్ని మాత్రమే పుచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా కూడా ఛావా మూవీ లోని విక్కీ కౌశల్ నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: