నందమూరి నట సింహం బాలకృష్ణ తాజాగా డాకు మహారాజ్ అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి బాబి కొల్లి దర్శకత్వం వహించగా ... ఈ మూవీ లో ఊర్వశి రౌటేలా , ప్రగ్యా జైస్వాల్ , శ్రద్ధ శ్రీ నాథ్ ముఖ్య పాత్రలలో నటించారు. సీతారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మించగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల చేశారు. ఇకపోతే ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ మూవీ ని ఫిబ్రవరి 21 వ తేదీ నుండి నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇకపోతే ఈ వారం అనేక సినిమాలు ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వనుండగా అందులో డాకు మహారాజు సినిమాతో పాటు మరో సినిమా గురించి ప్రేక్షకులు ఎక్కువగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. అదే బేబీ జాన్. బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ హీరోగా రూపొందిన బేబీ జాన్ మూవీ లో కీర్తి సురేష్ హీరోయిన్గా నటించింది.

మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదల అయింది. కానీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి ప్లాట్ ఫామ్ లో ఫిబ్రవరి 21 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కాబోతోంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది. అలా ఈ వారం ఎన్నో సినిమాలు ఓ టీ టీ లోకి వస్తున్న బాలయ్య , వరుణ్ ధావన్ సినిమాల గురించి ప్రేక్షకులు ఎక్కువగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: