టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ కలిగి ఉన్న నటి మణులలో అనుష్క ఒకరు. ఈ ముద్దుగుమ్మ నాగార్జున హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన సూపర్ అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అయింది. ఈ మూవీ లో అనుష్క తన నటనతో అంద చందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. దానితో ఈ బ్యూటీ కి ఈ సినిమా ద్వారా అద్భుతమైన గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత వరుస పెట్టి అనుష్క కు తెలుగు స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కడం , అందులో చాలా మూవీలు మంచి విజయాలు సాధించడంతో అత్యంత తక్కువ కాలంలోనే అనుష్క తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థానానికి చేరుకుంది.

ఇకపోతే అనుష్కకు అద్భుతమైన క్రేజ్ ఉన్న కూడా ఈమె మాత్రం చాలా స్లో గా ఆచితూచి సినిమాలను చేస్తూ వస్తోంది. అనుష్క ఆఖరుగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం అనుష్క , క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఘాటి అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ మూవీ నుండి ఇప్పటికే మేకర్స్ కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా అవి అద్భుతంగా ఉండడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ఈ సంవత్సరం ఏప్రిల్ 18 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

మూవీ ఏప్రిల్ 18 వ తేదీన విడుదల కావడం కష్టం అని , ఈ మూవీ కి సంబంధించిన చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి అని , దానితో ఈ మూవీ పోస్ట్ పోన్ కాబోతుంది అని ఒక వార్త వైరల్ అవుతుంది. దానితో ఈ మూవీ బృందం ఘటి సినిమా ఖచ్చితంగా ఏప్రిల్ 18 వ తేదీన విడుదల అవుతుంది. ఆ విషయంలో ఎలాంటి అనుమానం లేదు అని క్లారిటీ ఇచ్చింది. దానితో ఈ సినిమా ఏప్రిల్ 18 వ తేదీన విడుదల కాపడం కన్ఫామ్ అని అర్థం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: