సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్స్ పేర్లు ఎలా మారుమ్రోగిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . మరీ ముఖ్యంగా స్టార్స్ గురించి వార్తలు ఎప్పుడు వినిపిస్తూనే ఉంటాయి . అయితే ఎప్పటికప్పుడు ఆ ట్రెండింగ్  స్థానంలో ఉండే స్టార్ హీరోల పేర్లల్లో మార్పులు వస్తూనే ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ హీరో పేరు మారుమ్రోగిపోతుంది . మొన్న మొన్నటి వరకు చాలా సైలెంట్ గా ఉన్న ఈ హీరో పేరు ఒకే ఒక్క సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకోవడంతో జనాలు షాక్ అయిపోతున్నారు.


లక్ అంటే విడిదేరా మామ అంటూ ఘాటు ఘాటుగా ఆయనను పోగిడేస్తున్నారు . ఇంతకీ ఆ హీరో ఎవరనుకుంటున్నారా ..? బాలీవుడ్ స్టార్ హీరో "విక్కీ కౌశల్".  విక్కీ కౌశల్ అంటే ఒక హీరో ..బాగా నటిస్తాడు.. మంచి నటుడు హీరోయిన్ కత్రినా కైఫ్ భర్త.. ఇంతవరకే తెలుసు జనాలకి.  ఆయన గురించి అంతకుమించిన డీటెయిల్స్ ఏవి తెలియదు. అయితే ఆయనలో స్పెషల్ నటుడు కూడా దాగున్నాడు అన్న విషయాన్ని బయట పెట్టాడు విక్కీ కౌశల్ . రీసెంట్గా ఆయన నటించిన సినిమా "చావా".



సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.  రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే 100 కోట్లు క్రాస్ చేసి బాలీవుడ్ హిస్టరీని తిరగరాసింది అంటే ఈ సినిమాలో రష్మిక మందన్నా.. అదే విధంగా విక్కీ కౌశల్ నటన ఎంత అద్భుతంగా ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు . ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే విక్కీ కౌశల్ పేరు అదే విధంగా రష్మిక మందన్నా పేరే వినిపిస్తుంది . రష్మిక మందన్నా ఆల్రెడీ పాన్ ఇండియా హీరోయిన్ . పుష్ప2 తో.. అనిమల్ సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసి పడేసింది. గత మూడు రోజుల నుంచి సోషల్ మీడియా మొత్తం కూడా విక్కీ కౌశల్ పేరే మారుమ్రోగిపోతుంది . ఇలాంటి నటుడు అసలు ఇండియాలో ఉన్నాడా..? అంటూ కూడా మాట్లాడుకుంటున్నారు . అంతలా "చావా" సినిమాతో ఆయన పాపులారిటీ సంపాదించేసుకున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: