సినిమా ఇండస్ట్రీ లో ఒకరు రిజెక్ట్ చేసిన కథలో మరొకరు హీరోగా నటించడం సర్వ సాధారణంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఒకే కథను అనేక మంది రిజెక్ట్ చేసినట్లయితే ఆ కథలో కూడా నటించు హిట్లను అందుకున్న వారి సంఖ్య కాస్త తక్కువ గానే ఉంటుంది. ఎందుకు అంటే ఒక కథను ఒకరు రిజెక్ట్ చేశారు అంటే అందుకు అనేక కారణాలు ఉండొచ్చు. కానీ ఒకే కథను అనేక మంది రిజక్ట్ చేశారు అంటే ఆ కథలో అనేక లోపాలు ఉండే అవకాశం ఉంటుంది. కానీ అలాంటి కథలతో కూడా కొంత మంది అద్భుతమైన విజయాలను అందుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇక చాలా మంది హీరోలు రిజెక్ట్ చేసిన ఓ కథతో మాస్ మహారాజా రవితేజ ఏకంగా బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడట. ఆ సినిమా ఏది ..? ఆ స్టోరీని ఎంత మంది రిసార్ట్ చేశారు అనే వివరాలను తెలుసుకుందాం.

మాస్ మహారాజా రవితేజ కొన్ని సంవత్సరాల క్రితం బోయపాటి శ్రీను దర్శకత్వంలో భద్ర అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. మీరా జాస్మిన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే మొదటగా ఈ సినిమా కథను బోయపాటి శ్రీను , అల్లు అర్జున్ కు వినిపించాడట. ఆయనకు ఈ కథ నచ్చిన కూడా అప్పటికే ఆయన వేరే సినిమాకు కమిట్ అయ్యి ఉండడంతో ఈ సినిమా చేయలేను అని చెప్పేసాడట. ఆ తర్వాత బోయపాటి ఇదే కథను తారక్ కి వినిపించాడట. కథ మొత్తం విన్న తారక్సినిమా తనకు సెట్ కాదు అనే ఉద్దేశంతో ఈ మూవీ ని రిజెక్ట్ చేశాడట. ఆ తర్వాత రవితేజ కు ఈ సినిమా కథను వినిపించగా ఆయన మాత్రం ఈ సినిమాను ఓకే చేశాడట. అలా అల్లు అర్జున్ , తారక్ రిజెక్ట్ చేసిన కథతో రవితేజ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: