![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/sirish-who-set-fire-silently-allu-hero-s-blow-is-not-normal0db84a52-9a8c-4cf2-8688-470d4ddcd94f-415x250.jpg)
రీసెంట్ గానే పుష్ప 2 సినిమాతో బిగ్ హిట్ తన ఖాతాలో వేసుకున్న అల్లు అర్జున్. ప్రెసెంట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు. అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పై కి వెళ్తుంది అనేది ఇంకా క్లారిటీ రాలేదు . కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో అల్లు అర్జున్ బ్రదర్ అల్లు శిరీష్ పేరు మారు మ్రోగిపోతుంది . నిజానికి అల్లు శిరీష్ పేరు సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రెండ్ అవ్వదు . సినిమాల పరంగా వ్యక్తిగతంగా ఆయన ఎప్పుడు సైలెంట్ గానే ఉంటాడు . అయితే రీసెంట్ గా విక్కీ కౌశల్ - రష్మిక మందన్నా నటించిన "చావా" సినిమా రివ్యూ ఆయన చెబుతూ సినిమా బాగుంది అంటూనే సైలెంట్ గా మంట పెట్టేసాడు . దీంతో సోషల్ మీడియాలో అల్లు శిరీష్ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది . అల్లు శిరీష్ "చావా" సినిమా గురించి రివ్యూ ఇస్తూ ఓ రేంజ్ లో పొగిడేసాడు.
"చావా మూవీ చాలా చాలా అద్భుతంగా ఉంది . విక్కీ కౌశల్ నటన టూ పిక్స్ కి వెళ్ళిపోయింది . శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ నటన అద్భుతం . అక్షయ్ కన్నా జీ..రష్మిక ..ఆశు నానాజీ అందరూ కూడా బాగా నటించారు. డైరెక్టర్ లక్ష్మణ్ , నిర్మాతలు ఇలాంటి ఎపిక్ సినిమాని తెరకెక్కించినందుకు చాలా చాలా థాంక్స్ .. మన పాఠ్యపుస్తకాలు ఇలా గొప్ప భారతీయ రాజుల గురించి చెప్పనందుకు చాలా సంతోషంగా ఉంది . సినిమాల ద్వారా వీరి గురించి తెలుసుకుంటున్నాము" అంటూ ట్విట్ చేశాడు. అంటే నేటి విద్యాసంస్థ గురించి ఆయన దెప్పి పొడిచినట్టు ఉంది అంటున్నారు జనాలు . మహనీయుల గురించి అసలు తెలుసుకునే అవకాశం లేకుండా ఉన్న పాఠ్యపుస్తకాలు దేనికి అని ..వ్యంగ్యంగా విద్యాసంస్థకు కౌంటర్ వేశాడు అంటున్నారు. సోషల్ మీడియాలో ప్రజెంట్ శిరీష్ పెట్టిన పోస్ట్ బాగా ట్రెండ్ అవుతుంది..!