టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో చిరంజీవి , బాలకృష్ణ ముందు వరుసలో ఉంటారు. ఇకపోతే చిరంజీవి 2023 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా వాల్టేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకులను పలకరించగా , బాలకృష్ణ అదే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా వీర సింహా రెడ్డి మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రెండు మూవీలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి.

ఇక 2023 వ సంవత్సరం చిరంజీవి "భోళా శంకర్" సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా , అదే సంవత్సరం బాలయ్య "భగవంత్ కేసరి" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక భోళా శంకర్ సినిమా తర్వాత చిరంజీవి "విశ్వంభర" అనే సినిమాను మొదలు పెట్టాడు. ఇప్పటికీ ఆ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది. ఇక బాలకృష్ణ మాత్రం తాజాగా డాకు మహారాజు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం బాలయ్య "అఖండ 2"  సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఆ తర్వాత వీర సింహా రెడ్డి మూవీ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ మూవీ చేయడానికి కమిట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటివరకు వెలబడలేదు. ఇలా ఇంత కాలం పాటు బాలకృష్ణ ఫుల్ జోష్లో దూసుకుపోతూ ఉంటే చిరంజీవి మాత్రం బాలకృష్ణను దాటిపోయేలా కనబడుతున్నాడు. ఎందుకు అంటే ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్న చిరు ఇప్పటికే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మూవీకి కమిట్ అయ్యాడు.

సినిమా షూటింగ్ కూడా ఈ సంవత్సరం సమ్మర్ నుండి మొదలు కానున్నట్లు చిరంజీవి ప్రకటించాడు. అలాగే శ్రీకాంత్ ఓదేలా దర్శకత్వంలో ఓ మూవీకి కమిట్ అయ్యాడు. ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అలాగే బాబి కొల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఓ మూవీ సెట్స్ పై ఉండగానే చిరంజీవి మూడు సినిమాలను లైన్లో పెట్టుకొని వరస సినిమాల విషయంలో బాలయ్యకు ఏ మాత్రం తగ్గకుండా కెరియర్ను ముందుకు సాగే విధంగా ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: