కొంత మంది నటీ మణులకు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే అద్భుతమైన విజయాలు , మంచి గుర్తింపు వస్తూ ఉంటుంది. అలాంటి వారు చాలా తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుతారు. అలా తక్కువ కాలంలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారు స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుతారు అనే అభిప్రాయాలను కూడా అనేక మంది వ్యక్తం చేస్తూ ఉంటారు. అలా తెలుగు సినిమా పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని దక్కించుకొని , మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత కూడా మంచి విజయాలను అందుకున్న ఓ బ్యూటీ చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ కి చేరుకుంటుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఆ తర్వాత మాత్రం ఆమెకు మంచి విజయాలు దక్కకపోవడంతో ఆమె మీడియం రేంజ్ హీరోయిన్ గానే మిగిలి పోవాల్సి వచ్చింది.

బ్యూటీ ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు మోస్ట్ బ్యూటిఫుల్ , అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి రెజీనా. ఈ ముద్దుగుమ్మ SMS అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం , ఇందులో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టి పడేయడంతో ఈ బ్యూటీ కి ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత కూడా ఈమెకు మంచి విజయాలు దక్కడంతో ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంటుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఈమెకు సరైన విజయాలు దక్కలేదు. దానితో ఈమె మీడియం రేంజ్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తుంది. ప్రస్తుతం కూడా ఈమె అనేక సినిమాలలో నటిస్తూ కెరియర్ను ముందుకు సాగిస్తోంది. కానీ స్టార్ హీరోల సినిమాలలో , అదిరిపోయే రేంజ్ ఉన్న సినిమాలలో అవకాశాలను దక్కించుకోలేక పోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: