సినిమా ఇండస్ట్రీలో హిట్లు ఉన్న నటి మనులకే వరుస పెట్టి అవకాశాలు వస్తాయి అని అభిప్రాయాలను చాలా మంది చాలా సందర్భాలలో చెప్పుకొస్తూ ఉంటారు. అది దాదాపు వాస్తవం. ఎందుకు అంటే సినిమా ఇండస్ట్రీ లో మంచి విజయాలు ఉన్న వారికే మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి. అలాంటి వారే తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ స్టేటస్ కి చేరుకుంటూ ఉంటారు. కానీ ఇది కొంత మంది విషయంలో మాత్రం రాంగ్ అని చాలా సార్లు ప్రూవ్ అయింది. కొంత మంది కి పెద్దగా విజయాలు లేకపోయిన వరుస పెట్టి స్టార్ హీరోల సినిమాలలో ఫుల్ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు వచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఓ బ్యూటీ కేవలం ఒకే ఒక్క సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది.

అయినా కూడా ఆమెకు వరుస పెట్టి క్రేజీ సినిమాల్లో అవకాశాలు దక్కుతున్నాయి. ఆమె ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు భాగ్య శ్రీ బోర్సే. ఈ ముద్దు గుమ్మ రవితేజ హీరోగా రూపొందిన మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ అయినా ఈ మూవీ లో ఈ బ్యూటీ తన అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. దానితో ఈ మూవీ ద్వారా ఈమె ఒక మంచి గుర్తింపు లభించింది. దానితో ప్రస్తుతం ఈమెకు వరస పెట్టి తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కుతున్నాయి. ఇప్పటికే ఈమె చేతిలో అనేక సినిమాలు ఉన్నాయి. మరో కొత్త సినిమా అవకాశం కూడా ఈమెకు వచ్చినట్లు తెలుస్తోంది. తమిళ నటుడు సూర్య హీరో గా టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరిసినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో భాగ్యశ్రీ ను  హీరోయిన్గా సెలెక్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో శ్రీ లీలా వరుస సినిమాలతో దూసుకుపోతూ ఉంటే ఆమె రేంజ్ లో భాగ్య శ్రీ కూడా అవకాశాలను దక్కించుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: