సంక్రాంతి పండగ సందర్భంగా యంగ్ హీరోల కంటే కూడా సీనియర్ హీరోలు తమ సినిమాలను విడుదల చేయడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తూ వస్తున్నారు. దానితో దాదాపు ఆఖరి 10 సంవత్సరాలలో చాలా సంవత్సరాలు సంక్రాంతి పండుగకు టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోలు అయినటువంటి చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున , వెంకటేష్ నటించిన సినిమాలు విడుదల అయ్యాయి. అందులో అనేక సార్లు వీరు నటించిన సినిమాలు సంక్రాంతి విన్నర్ గా కూడా నిలిచిన సందర్భాలు ఉన్నాయి. ఇక ఆఖరి 10 సంవత్సరాలలో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు అయినటువంటి చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున , వెంకటేష్ నటించిన ఏ సినిమాలు ఏ సంవత్సరం సంక్రాంతి విన్నారుగా నిలిచాయి అనే వివరాలను తెలుసుకుందాం.

చిరంజీవి : 2017 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా చిరంజీవి హీరోగా రూపొందిన ఖైదీ నెంబర్ 150 సినిమా విడుదల అయ్యి ఆ సంవత్సరం సంక్రాంతి విన్నారుగా నిలిచింది. అలాగే 2023 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమా విడుదల అయ్యింది. ఈ సినిమా కూడా 2023 వ సంవత్సరం సంక్రాంతి విన్నారుగా నిలిచింది.

బాలకృష్ణ : ఆఖరి 10 సంవత్సరాలలో బాలకృష్ణ హీరో గా రూపొందిన ఎన్నో సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచినప్పటికీ 2018 వ సంవత్సరం బాలకృష్ణ హీరోగా రూపొందిన జై సింహా సినిమా సంక్రాంతి విన్నారుగా నిలిచింది.

నాగార్జున : 2016 వ సంవత్సరం నాగార్జున హీరోగా రూపొందిన సోగ్గాడే చిన్నినాయన సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలిస్తే , 2022 వ సంవత్సరం నాగార్జున హీరో గా రూపొందిన బంగర్రాజు మూవీ సంక్రాంతి విన్నారుగా నిలిచింది 

వెంకటేష్ : 2019 వ సంవత్సరం వెంకటేష్ ,వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందిన ఎఫ్ 2 సినిమా సంక్రాంతి విన్నారుగా నిలిస్తే , 2025 వ సంవత్సరం వెంకటేష్ సోలో హీరో గా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: