టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన స్టార్ హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించాడు. ఇకపోతే మహేష్ బాబు తనకు ఒక సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందించిన దర్శకులకు రెండో అవకాశం ఇచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ అలా మహేష్ తనకు మొదటి సారి అద్భుతమైన విజయం అందించిన దర్శకులకు రెండవ అవకాశం ఇచ్చిన సందర్భాలలో అనేక సార్లు ఆయనకు అపజయాలే వచ్చాయి. కానీ ఒక దర్శకుడు మాత్రం మహేష్ బాబుకు సూపర్ సాలిడ్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని రెండవ సారి కూడా అందించాడు. ఆయన మరెవరో కాదు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.

మహేష్ బాబు , పూరి జగన్నాథ్ కాంబోలో మొదటగా పోకిరి అనే సినిమా వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు బాక్సా ఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ పాజిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా అప్పటి వరకు ఏ తెలుగు సినిమా వసూలు చేయని కలెక్షన్లను వసూలు చేసి ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీ తో మహేష్ బాబు , పూరి జగన్నాథ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయాయి. ఇలా తనకు పోకిరి సినిమాతో ఏకంగా ఇండస్ట్రీ హిట్ ను అందించిన పూరి జగన్నాథ్ కి మహేష్ మరో అవకాశం ఇచ్చాడు. దానితో పూరి జగన్నాథ్ , మహేష్ బాబు తో బిజినెస్ మాన్ అనే సినిమాను రూపొందించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో మహేష్ నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. అలా మహేష్ బాబు , పూరి జగన్నాథ్ ను రెండు సార్లు నమ్మి సినిమా అవకాశాలు ఇవ్వగా పూరి జగన్నాథ్ , మహేష్ బాబుకు రెండు బ్లాక్ బాస్టర్ విజయాలను అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: