
తన పాత్రలో బలముంటే చిన్న హీరోలతో సైతం నటించేందుకు రెడీ అవుతుంది .. బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా లెవెల్ లో భారీ క్రేజ్ తెచ్చుకున్న అనుష్క ఆ తర్వాత కొన్నాళ్లు బ్రేక్ తీసుకుంది .. ఇప్పుడిప్పుడే మళ్ళీ తిరిగి సినిమాల్లో నటిస్తూ బిజీ అవుతుంది. ఇటీవలే యంగ్ హీరో నవీన్ పోలిశెట్టికి జంటగా మిస్ శెట్టి మిసెస్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించింది .. అయితే ఈ సినిమా తర్వాత ఓ స్టార్ హీరో సినిమాలో అనుష్కకు మంచి ఆఫర్ వచ్చిందట .. అలాగే ఈ సినిమా కోసం ఆమెకు 5 కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తామని కూడా చెప్పారట .. కానీ ఆ సినిమాలో అనుష్క నటించేందుకు నో చెప్పిందట ..
ఎందుకంటే ఆ సినిమాలో అనుష్క పాత్రకు అంతగా ప్రాధాన్యత లేకపోవటమే అని తెలుస్తుంది .. ఇప్పటికే సినిమా అవకాశాలు తగ్గిపోతున్న కూడా అనుష్క తనకు వచ్చిన ఆఫర్స్ అయితే నటనకు ప్రాధాన్యత లేదని రిజెక్ట్ చేయటంపై ప్రశంసలు వస్తున్నాయి. ఇక ప్రస్తుతం అనుష్క ఘాటి సినిమాలో నటిస్తుంది .. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి . లేడీ ఓరియంటెడ్ సినిమాగా వస్తున్న ఈ సినిమాలో అనుష్క పక్కా మాస్ పవర్ఫుల్ రోల్ లో కనిపించనుంది . ఈ సినిమాతో అనుష్క ఎలాంటి విజయం అందుకుంటుందో చూడాలి.