![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/anupama6926455-4298-4f4a-bf0a-f4fb5d90f705-415x250.jpg)
ఇక 2017లో ప్రేమమ్ సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది ఈ మూవీ మంచి విజయం అందుకుంది .. ఆ తర్వాత తెలుగులో శతమానం భవతి సినిమాలో హీరోయిన్గా నటించింది .. అలాగే తెలుగు తో పాటు తమిళం , కన్నడ , మలయాళం లో కూడా పలు సినిమాలో నటించి అదరగొట్టింది .. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ల ఒక్కరిగా పేరు తెచ్చుకుంది . అయితే అనుపమ పరమేశ్వరన్ కేవలం 19 సంవత్సరాల వయసులోనే హీరోయిన్గా మారింది . మలయాళం లో వచ్చిన ప్రేమమ్ ఆమె కెరియర్ను మార్చేసింది .. ఈ సినిమాలో కనిపించింది కొద్దిసేపు మాత్రమే అయినా కూడా అందర్నీ ఎంతగానో ఆకర్షించింది.
అనుపమ సినిమాల్లో అడుగు పెట్టినప్పుడు ఆమె ఇంకా కాలేజీల్లో చదువుకుంటుంది .. కొట్టాయం లోని CMS కళాశాలలో ఇంగ్లీషులో బ్యాచిలర్ డిగ్రీ చదువుతుంది .. ప్రేమమ్ సినిమా తర్వాత అనుపమ కు వరుస అవకాశాలు రావడంతో కాలేజీ చదువుని ఆపేసింది .. అలాగే ఈమెకు సినిమా అంటే చాలా ఆసక్తి ఉండేది .. అలాగే అనుపమ ఓ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా వర్క్ చేసింది .. ఆ సినిమాలోనే ప్రధాన పాత్రలో కూడా నటించింది. అలాగే సౌత్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తో అనుపమ కు మంచి స్నేహం ఉంది . అదే విధంగా ఈమెకు జంతువులంటే ఎంతో ప్రేమ .. ఈమె ఇంట్లో ఎన్నో రకాల జంతువులు కూడా ఉంటాయి .. వాటిని ఈమె ఎంతో ప్రేమగా చూసుకుంటుంది.. అలాగే కన్నడ దివంగత స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ తో కలిసి నటసార్వభౌమ సినిమాలో కూడా నటించింది . ఈ సినిమా ద్వారా ఈమె మంచి పేరు కూడా తెచ్చుకుంది.