
రష్మిక ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో అదరగొడుతున్న హీరోయిన్ .. ఇటివలే పుష్ప 2 సినిమాతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చూపించింది ఈ బ్యూటీ .. ఇక ఇప్పుడు చావా సినిమాతో మరో భారీ హిట్లు తన ఖాతాలో వేసుకుంది .. వీటికి ముందు యానిమల్ సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేసింది . ఈ సినిమా కూడా 2023లో వచ్చి 900 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి రికార్డులు క్రియేట్ చేసింది. ఆ తర్వాత గత ఏడాది డిసెంబర్లో పుష్ప సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వచ్చింది .. సుకుమార్ , అల్లుఅర్జున్ కాంబోలో వచ్చిన ఈ సినిమా 2024 డిసెంబర్ 5న రిలీజ్ అయింది .. ఈ సినిమా కూడా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 1850 కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది.
ఇక ఇప్పుడు ఈమె నటించిన ఛావా సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతుంది .. ఫిబ్రవరి 14న రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తుంది .. హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో చత్రపతి స్తంభాజి మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ నటించిగా ఆయన భార్య యెసుభాయ్ పాత్రలో రష్మిక నటించింది .. మహారాణి పాత్రలో రాజ్యసంతో పాటు హుందాగా నటించింది .. ఇప్పటికే ఈ సినిమా 120 కోట్ల మార్కు కలెక్షన్ దాటింది .. ఈ సినిమాతో రష్మిక నటనపై ప్రశంసలు కూడా వస్తున్నాయి.. ఇలా పాన్ ఇండియ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు సంవత్సరాల్లో మూడు భారీ విజయాలు అందుకని లక్కీ హీరోయిన్గా మారిపోయింది .