- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


ఒకప్పుడు వారిద్దరు దక్షిణాది సినిమా పరిశ్రమలో వరుస హిట్లు అందుకున్న క్రేజీ కుర్ర హీరోలు.. ఎన్నో అందమైన ప్రేమకథా సినిమాలతో వెండితెరపై సందడి చేశారు. బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకుని అప్పట్లో టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు. ఆ ఇద్దరే తరుణ్ - ఉదయ్ కిరణ్. వీరిద్దరికీ అప్పట్లో ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా ఇద్దరికీ అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే ఉండేది. తరుణ్ - ఉదయ్ కిరణ్ కాంబినేషన్లో ఓ సినిమా రావాల్సి ఉందట. కానీ చివరి క్షణం ఆ ప్రాజెక్టు నుంచి ఉదయ్‌ తప్పు కావడంతో చివరకు బాలీవుడ్ హీరో తో చేయాల్సి వచ్చింది. దీంతో ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. ఆ సినిమా ఏంటో కాదు సోగ్గాడు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డైరెక్టర్ రవిబాబు దర్శకత్వంలో తరికెక్కిన సోగ్గాడు సినిమా 2005 మార్చి 31న రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.


ఈ సినిమాలో తరుణ్ కి జోడిగా అతని సరసన ఆర్తి అగర్వాల్ హీరోయిన్గా నటించింది. థియేటర్లలో ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. అప్పటికే వరుస ప్లాపులతో సతమతమవుతున్న తరుణ్ ఖాతాలో ఈ సినిమా మరో డిజాస్టర్ అయింది. ఈ సినిమా ప్లాప్ అవ్వటానికి మరో రీజన్ ఉందని రవిబాబు గతంలో ఇంటర్వ్యూలో చెప్పారు ఈ సినిమాను ముందుగా ఆర్తి అగర్వాల్తో కలిసి తీయాలి అనుకున్నారట. కథ విన్న తర్వాత తరుణ్ ఆర్తి అగర్వాల్ ఓకే చెప్పారని .. ఉదయ్ కిరణ్ డైల‌మాలో పడిపోయాడని గుర్తు చేసుకున్నాడు. స్వయంగా చెన్నై వెళ్లి మాట్లాడితే ముందు సినిమా చేస్తానని చెప్పి ఆ తర్వాత నిర్మాత సురేష్ బాబుని కలిసి ఈ సినిమా చేయనని చెప్పారట. దీంతో రఘుబాబు హిందీ నుంచి జుగల్ హ‌న్స‌రాజును తీసుకువచ్చి ఉదయ్ స్థానంలో చేయించారు.


నష్టమైన కష్టమైన ఉదయతో ఈ సినిమా చేయాల్సిందని ... తాను ఈగోకి పోయి కోపంతో ఈ నిర్ణయం తీసుకోవడంతో సినిమా డిజాస్టర్ అయిందని రవిబాబు తెలిపారు. అప్పట్లో ఉదయ్ కిరణ్ - త‌రుణ్ - ఆర్తి అగర్వాల్ ముగ్గురికి విపరీతమైన క్రేజ్ ఉండేదని ఈ ముగ్గురితో సినిమా చేస్తే ప్రేక్షకులకు ఎక్కువగా కనెక్ట్ అయ్యేదని .. అందుకు తగినట్టే క్లైమాక్స్ కూడా రాసుకున్నానని కానీ చివరకు మరో హీరోను తీసుకురావడంతో ఆర్తి అగర్వాల్ తరుణ్ తో వెళ్ళిపోతుందని ప్రేక్షకులకు ముందే అర్థమై సినిమా ప్లాప్ అయిందని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: