
టాలీవుడ్ లెజెండ్రీ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం డైరెక్టర్ మల్లిడి వశిష్ట దర్శకత్వం లో విశ్వంభర అనే సోషియో ఫాంటసీ సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వాస్తవానికి ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. గత ఏడాది రిలీజ్ అనుకున్నారు .. షూటింగ్ ఆలస్యం కావడంతో సంక్రాంతి అనుకున్నారు .. ఇప్పుడు సమ్మర్ అనుకుంటున్నారు .. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే తాజాగా సంక్రాంతి వస్తున్నాం సినిమా తో కెరీర్ లోని అదిరిపోయే బ్లాక్ బస్టర్ హీట్ తన ఖాతాలో వేసుకున్న యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం లో సాలిడ్ కామెడీ ఎంటర్టైనర్ చేసేందుకు ఓకే చెప్పారు. త్వరలోనే సెట్స్ మీదకి వెళ్ళనున్న ఈ సినిమా విషయంలో దర్శకుడు అనిల్ రావిపూడి చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నారు. రాజాగా ఈ సినిమా నుంచి ఒక క్రేజీ న్యూస్ ఇప్పుడు బయటకు వచ్చేసింది.
ఈ సినిమా మ్యూజిక్ విషయంలో అనిల్ రావిపూడి చాలా కేర్ తీసుకుంటున్నారట. ఈ సినిమాకి కూడా సంక్రాంతి వస్తున్నాం సంగీత దర్శకుడు బీమ్స్ సిసి రోలియో నే వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ సినిమా కోసం ఆల్రెడీ భీమ్స్ నాలుగు సాంగ్స్ ఇచ్చేసారట. ఇది నిజంగా ఊహించని విషయం అని చెప్పాలి. ఇప్పటికే తన కెరీర్ లో ఎనిమిది వరస సూపర్ డూపర్ హిట్స్ సినిమాలతో తీసుకుపోతున్న అనిల్ రావిపూడి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసి ఎలాగైనా సూపర్ డూపర్ హిట్ కొట్టాలని చాలా కసితో వర్క్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ కంటిన్యూగా పూర్తి చేసి వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సాహు గారపాటి భారీ బడ్జెట్ తో ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.